• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » విడాకులు ఇచ్చి..మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి !

విడాకులు ఇచ్చి..మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి !

Published on October 16, 2022 by Bunty Saikiran

Advertisement

నా పెళ్లిళ్ల గురించి మాట్లాడకుండా…వైసీపీ వాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోండని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. నిన్న విశాఖ గర్జనలో భాగంగా.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ విశాఖ లోని నోవా హోటల్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రోజాకు కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement

Read Also : Kantara Movie Review : “కంతారా” రివ్యూ..RRR, KGFను మించిపోయిందిగా !

తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం పై పొద్దస్తమానం వైసిపి విమర్శలు చేస్తోందని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ‘మాట్లాడితే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను అంటున్నారు. అంత బాధ ఎందుకు, మీరు చేసుకోండి. విడాకులు ఇచ్చి చేసుకోండి. నేను మూడుసార్లు పెళ్లి చేసుకున్నందుకు మీరు చాలా అసూయ పడుతున్నట్లు అనిపిస్తోంది’ అని సెటైర్ వేశారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే.. మూడు రాజధానులు చేస్తారా అని నిలదీశారు. వైసీపీకి ఉత్తరాంధ్ర, రాయలసీమ మీద అంత ప్రేమ ఉందా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Advertisement

ఆదివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీమ నుంచి సీఎంలు వచ్చినా ఇంకా వెనుకబాటులోనే ఉందని విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణ కావాలి, కానీ అధికార వికేంద్రీకరణకు మాత్రం ఒప్పుకోరని అన్నారు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే, మిగతా వాళ్ళు వికేంద్రీకరణ పై మాట్లాడతారని సీఎం జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రం నుంచి సంస్థలన్నీ వెళ్లిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక్కరే తీసుకునే నిర్ణయాల వల్లే అందరికీ ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఒక్కరే అధికారం చెలాయించాలి కానీ, రాజధానులు మాత్రం మూడు కావాలంటూ పవన్ ఎద్దేవా చేశారు.

ఉత్తరాంధ్ర నేతల్లో వెనుకబాటు లేదని, ప్రజల్లో మాత్రమే ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసిపి ప్రభుత్వం లో అధికార వికేంద్రీకరణ ఎక్కడుందని ప్రశ్నించారు. మంత్రులు పేరుకే మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నవాళ్లు గర్జించడం ఏంటన్నారు. తాము గొడవలు పెట్టుకోలేక కాదని, పోలీసులపై గౌరవంతో మౌనంగా ఉన్నామన్నారు. వైసీపీ బెదిరింపులు తమకు కొత్త కాదని, ఉడత ఊపులకు భయపడనని అన్నారు. ఇది ఇలా ఉండగా..తాజాగా పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు జారీ చేశారు పోలీసులు. సాయింత్రం 4 గంటలోగా విశాఖ నగరం/ నోవా హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది ఆ నోటీసుల సారాంశం. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ విశాఖను వీడకపోతే.. అరెస్ట్‌ చేసేందుకు.. పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read Also : నయనతార జీవితంలో వేణు స్వామి చెప్పిన మాటలే నిజమయ్యాయా..తర్వలోనే విడాకులు తీసుకుంటుందా ?

Related posts:

పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ కౌంటర్..అలా చేస్తే ఏపీ మహిళల పరిస్థితి ఏంటి ! Default Thumbnail2024 ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన బిజెపితో బంధం తెంచుకున్న పవన్ కళ్యాణ్ ! వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd