Advertisement
టి-20 ప్రపంచ కప్ 2022 కోసం భారత జట్టు సన్నాహాలలో నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలో నేడు తొలి వామప్ మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్స్ స్కిల్స్ ప్రదర్శించాడు. ఒంటి చేత్తో క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడని మనకు తెలిసిందే. ఆకాశాన్ని తాకేలా వెళ్లిన బంతుల్ని కూడా చక్కగా ఒడిసి పట్టుకోగలడు. అలానే బౌండరీ లైన్ వద్ద గాయాల గురించి ఆలోచించకుండా బంతి కోసం డైవ్ చేస్తుంటాడు.
Advertisement
Read also: GHEE: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి
Advertisement
అలాంటి విరాట్ కోహ్లీకి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ దొరికితే వదులుతాడా.. ఈ మ్యాచ్ లో కళ్ళు చెదిరే క్యాచ్ పట్టడమే కాదు.. టీమ్ డేవిడ్ ను రనౌట్ చేసిన తీరు కూడా హైలెట్. ఈ మ్యాచ్ లో తొలుత్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో 180 పరుగులకే ఆసీస్ ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమీ అద్భుతమే చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు వచ్చిన మహమ్మద్ షమీ వేసిన మూడవ బంతికి పాట్ కమ్మిన్స్ కొట్టిన బంతి విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న బౌండరీ వైపు వెళ్ళింది.
విరాట్ ఈ బంతిని గాల్లోకి జంప్ చేసి ఒంటి చేత్తో పట్టుకొని పాట్ కమ్మిన్స్ ని పెవిలియన్ కి పంపాడు. డగ్ – అవుట్ లో కూర్చున్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా కోహ్లీ క్యాచ్ ను ప్రశంసించారు. ఈ చివరి ఓవర్ లో నాలుగు రన్స్ ఇచ్చిన మహమ్మద్ షమీ.. నాలుగు వికెట్లను తీసి ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ ఇచ్చాడు. దీంతో 20 ఓవర్లలో 180 పరుగులకు ఆసీస్ ఆల్ అవుట్ అయింది. భారత జట్టు ఆరు పరుగుల తేడాతో తొలి వామప్ మ్యాచ్ లో విజయం సాధించింది.
Read also: మాస్ మహారాజ్ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు ఏవో తలుసా..!!