• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » 2024 ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

2024 ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

Published on October 17, 2022 by Bunty Saikiran

Advertisement

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం టూర్. మొన్న విశాఖపట్నం కు పవన్ కళ్యాణ్ వెళ్ళగా… అప్పటినుంచి ఇవాల్టి వరకు విశాఖలో హై టెన్షన్ నెలకొంది. పవన్ కళ్యాణ్ ను హోటల్ నుంచి బయటకు రాకుండా ఏపీ పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అయితే ఇవాళ విశాఖపట్నం వీడీ… పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అలాగే 2024 ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Advertisement

వైసిపి నుంచి ఏపీని విముక్తి చేయడమే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ ప్రకటించారు. ‘వైసీపీ విముక్త ఏపీ కోసమే ఎన్నికల్లో పోరాటం చేస్తాం. వైసిపి విముక్త ఏపీ జరగకపోతే తెలంగాణ కూడా నష్టపోతుంది. వైసిపి తో తేల్చుకుంటాం. వైసిపిని గద్దె దించుతాం. ఆ దిశగా అడుగులు వేస్తాం. కులం, మతం, ప్రాంతం అని కొట్టుకుంటుంటే అభివృద్ధి ఎక్కడుంటుంది? దీని పై ప్రజలు కూడా ఆలోచించాలి’ అని పవన్ కోరారు.

Advertisement

ఉత్తరాంధ్ర పై వైసీపీ నేతలకు ప్రేమ ఉంటే సైనికులకు చెందిన 71 ఎకరాల భూములను ఎందుకు ఆక్రమిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘విశాఖలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దస్ పల్లా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వైసిపి నేతల భూ కబ్జాలు బయటపడతాయని జనవాణి కార్యక్రమం జరగనీయలేదు. అధికారమంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకుని వికేంద్రీకరణ గురించి మాట్లాడడం విడ్డూరం’ అని పవన్ ఎద్దేవా చేశారు.

విశాఖలో మంత్రుల కార్లపై రాళ్ల దాడి జరుగుతుంటే, భద్రతగా ఉండాల్సిన పోలీసులు ఏమైపోయారని పవన్ ప్రశ్నించారు. ‘రెచ్చగొడితే నేను రెచ్చిపోతానని చూశారు. కానీ నేను చాలా సంయమనంతో ఉన్నా. వైసీపీకి హింస కావాలి. కానీ మేము చేయము. అధికారానికి దూరంగా ఉన్నవాళ్లు గర్జించాలి. ప్రభుత్వంలో ఉండి గర్జనలు, కూతలు ఏంటి? వైసీపీ శ్రేణులు ఎన్ని దాడులు చేస్తున్న కేసులు ఉండవు. దీనిని DGP సమర్ధిస్తారా? అని పవన్ ప్రశ్నించారు.

READ ALSO : “ఈనాడు” రామోజీరావు ఓ సైకో..కొడుకు సుమన్ మరణం వెనుక ?

Related posts:

విడాకులు ఇచ్చి..మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి ! వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్ పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ కౌంటర్..అలా చేస్తే ఏపీ మహిళల పరిస్థితి ఏంటి ! ఆర్కేతో చంద్రన్నకు తలనొప్పి.. స్వారీ చెబితేనే పొత్తు అంటున్న పవన్.. ఏమైందంటే..?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd