Advertisement
నందమూరి నటసింహం బాలకృష్ణ క్యారెక్టర్ గురించి, ముఖ్యంగా ఆయన మనసు గురించి తెలిసిన వారంతా చెప్పే మాట, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని. ఎప్పుడు ఓపెన్ గా ఉంటారని, స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో ఉంటారని ఇలా బాలయ్య గురించి గొప్పగా చెబుతుంటారు. బాలయ్య గురించి గిట్టని వాళ్లు కూడా మంచి మాటలే చెబుతారు. ఏ విపత్తు వచ్చినా ఎప్పటికప్పుడు తన సేవను ప్రదర్శిస్తూనే ఉంటాడు.
Advertisement
ఇప్పటికీ ఎంతోమందికి మేలు చేస్తూ తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. అందుకే బాలయ్య బాబు ఆయన అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆదివారం అనంతపురంలో జరిగిన తన వీరాభిమాని కుమార్తె వివాహానికి బాలకృష్ణ హాజరయ్యారు. పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆ తర్వాత హిందూపురంలోనీ వరద ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించారు. హీరో బాలకృష్ణ కాబట్టి ప్రజలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
Advertisement
ఆయన కూడా సెల్ఫీలు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. షూస్ చేతులో పట్టుకొని కనిపించారు బాలయ్య. అసాధారణ వర్షాలతో అతలాకుతలమైన హిందూపురం నియోజకవర్గంలోనే మఖాం వేసి మరి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. షూస్ కు మరకలు అవుతాయని, ఇస్త్రీ బట్టలు నలిగిపోతాయని ఆయన అనుకోలేదు. మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రజల్ని పరామర్శించారు. వారికి నిత్యావసరాలు అందించారు. అప్పటికప్పుడు సొంత నిధులతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాలకృష్ణ సహాయ కార్యక్రమాలు అక్కడి ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
read also : సీఎం కేసీఆర్ కు తీవ్ర అస్వస్థత!