Advertisement
ప్రేమ అనే రెండు పదాలలో ఏముందో కానీ ఇందులో పడ్డారంటే ఎవరైనా సరే మారిపోతారు అంతే.. ఇందులో ఏదో తెలియని మత్తు, మాయ ఉంటాయి. అందువల్లే ఈ ప్రేమలో పడ్డ వారు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ప్రేమే లోకంగా బతుకుతుంటారు.. అలా ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకొని చివరికి కొంతమంది ఈ ప్రేమను నిలుపుకోలేక ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. కొంతమంది ప్రేమలో విఫలమై అనేక ఇబ్బందులు పడి డిప్రెషన్లోకి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే ప్రేమలో విఫలం అయితే అదే తలచుకుంటూ బాధపడే జీవితాలు ఈ సమాజంలో చాలా వరకు ఉన్నాయి. ఇక ప్రేమలో విఫలమైనా వారు ఎలా బ్రతకాలి అనేది ఈ టిప్స్ చూసి ఫాలో అవ్వండి..
Advertisement
1. లవ్ ఫెయిల్ అయిన వ్యక్తులు పాత పార్ట్నర్ కు సంబంధించిన ఫోన్ నెంబర్లను డిలీట్ చేయాలి. లేదంటే వాటిని చూసినప్పుడల్లా మీ పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అవి మిమ్మల్ని కుంగదీస్తాయి. అంతేకాకుండా వారి ఫోటోలు వారికి సంబంధించిన వస్తువులను కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. ఒకవేళ మీ పార్టనర్ గురించి ఎవరైనా అడిగితే వారితో బ్రేకప్ అయిందని నిజం చెప్పాలి. అలా చెప్పడం వల్ల మీ మనసు కాస్త కుదుట పడి ఊరటనిస్తుంది. వారి సానుభూతి కూడా మీకు అందుతుంది.
also read: “కాంతార, రంగస్థలం” లో ఉన్న ఈ కామన్ పాయింట్ ను గమనించారా !
Advertisement
2. ఒకసారి లవ్ బ్రేక్ అప్ అయ్యాక ఇంకా వారు పార్ట్నర్ ని ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం తప్పు. తన లవ్ ఫెయిల్యూర్ అయిందని నిజాన్ని చెప్పి అంగీకరించి ముందుకు సాగాలి. ఎలాగైనా పాత పార్ట్నర్ ను ఇంప్రెస్ చేసి మళ్లీ వారి ప్రేమ పొందాలని అనుకోకూడదు. అలా అనుకుంటే అది మిమ్మల్ని మరింత కుంగదీస్తుంది. అలాగే మీ పాత పార్ట్నర్ మిమ్మల్ని జలసీగా ఫీల్ అయ్యేలా ప్రవర్తించకూడదు.
3. అంతేకాకుండా మీ పాత పార్ట్నర్ కు క్షమించమని కోరుతూ లెటర్ రాయాలి. దీంతో వారికి మీపై కనీసం అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ విధంగా కాకుండా విడిపోయామని చెప్పి వారిపై కోపం పెంచుకోకూడదు.
4. అలాగే పాత పార్ట్నర్ తో విడిపోయిన తర్వాత మీరు కొత్త రిలేషన్షిప్ కోసం వెతకాలి. అంతే కాకుండా పాత జ్ఞాపకాలను మర్చిపోవాలి. యోగా, ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ నియమాలు పాటిస్తే మీరు పాత పార్టనర్ ను మరిచిపోయి కాస్త హాయిగా జీవించవచ్చు.
also read: