Advertisement
హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో రిషబ్ శెట్టి తాజాగా నటించిన కన్నడ చిత్రం “కాంతారా” దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ వారం ఇతర భాషలో డబ్బింగ్ అయినప్పటి నుండి, ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందుతుంది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ముగుస్తుందో ఊహించడం కూడా ట్రేడ్ పండితులకు చాలా కష్టంగా మారింది. రెండు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. అయితే.. ఇంతటి సక్సెస్ అందుకున్న హీరో రిషబ్ శెట్టి గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం.
Advertisement
# రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని కుందాపూర్ లో ఇతను జన్మించాడు. 1983 జులై 7న ఇతను జన్మించాడు.
# ఇతను హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. రిషబ్ శెట్టి తండ్రి పేరు భాస్కర్ శెట్టి. తల్లి పేరు లక్ష్మి శెట్టి. ఇతనికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు ప్రవీణ్ శెట్టి.
# రిషబ్ శెట్టి ఫిలిం డైరెక్షన్ లో డిప్లమా చేశాడు. మొదట్లో ఇతను కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. అతను తెరకేక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.
# అంతేకాకుండా పలు టీవీ సిరీస్ లకు ఇతను పనిచేసేవాడు. ఆ టైములో అతని వద్ద డబ్బులు పెద్దగా ఉండేది కాదట. ఇంట్లో వాళ్ళు ఈ పని మానేసి మంచి జాబ్ లో జాయిన్ అవ్వు అని సలహాలు ఇచ్చిన ఫ్యాషన్ కొద్ది ఇతను సినిమా ఫీల్డ్ లో ఉండిపోయాడట.
# 2010లో ఇతను నటుడిగా మారాడు ‘నామ్ ఓరీలి ఒండినా’ చిత్రంలో క్రెడిట్ లేని రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన ‘తుగ్లక్’ లో కూడా నటించాడు.
Advertisement
# ఇలా చిన్నాచితక పాత్రలు చేసేది నామమాత్రంగానే! కానీ ఇతనికి దర్శకత్వం పైనే మోజు ఎక్కువగా ఉండేది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 2017లో ఇతనికి రక్షిత్ శెట్టి అవకాశం ఇచ్చాడు.
# ఇతనికి డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా ‘రిక్కీ’ 2016 లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హరిప్రియ హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.
# ఆ తర్వాత చేసిన ‘కిరిక్ పార్టీ’ అయితే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అప్పటినుండి ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ఈ చిత్రంలో కూడా రక్షిత్ శెట్టి హీరో కాగా, రష్మిక మందన ఈ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్ గా అవతరించిన సంగతి తెలిసిందే. అలాగే నటుడిగా రిషబ్ కు ‘బెల్ బాటమ్’ అనే చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ మూవీలో అతను చాలా బాగా నటించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతుంది.
# రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన మూడో చిత్రం ‘సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగోడు’. 2018లో వచ్చిన ఈ చిత్రానికి ఉత్తమ బాలల చిత్రం కేటగిరిలో రిషబ్ కు నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ మూవీకి నిర్మాత కూడా అతనే! అంతేకాదు రిషబ్ కు ఫిలిం ఫేర్ అవార్డు, ఐఫా అవార్డు, సైమా అవార్డు కూడా లభించింది.
# రిషబ్ ఓ తెలుగు సినిమాలో కూడా నటించాడు అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఈ ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో ఖలీల్ పాత్రలో చిన్న కేమియో ఇచ్చాడు.
# ఇక రిషబ్ కు 2017లో పెళ్లయింది. ఇతని భార్య పేరు ప్రగతి శెట్టి. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
# రిషబ్ ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా, దర్శకుడిగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించాడు.
READ ALSO : పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ కౌంటర్..అలా చేస్తే ఏపీ మహిళల పరిస్థితి ఏంటి !