Advertisement
ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆది పురుష్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. టీజర్ మొత్తం యానిమేషన్ తో నింపేశారు.
Advertisement
లీడ్ క్యారెక్టర్స్ ను కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరి చూపించారు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా హార్ట్ అయినట్లు ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ‘Disappointed’ అనే హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. యానిమేషన్ సినిమా చేస్తున్నట్లు ముందే చెప్పాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీజర్ లో కొన్ని షాట్స్ టెంపుల్ రన్ గేమ్ మూవీ అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పెట్టుకొని ఇలాంటి యానిమేషన్ సినిమా తీస్తారా? అంటూ మండిపడుతున్నారు.
Advertisement
ఇది ఇలా ఉండగా, ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ నటించారు. వీళ్ళ గురించి ప్రేక్షకులకు దాదాపు తెలుసు. కానీ హనుమంతుడి పాత్రధారి గురించి ఎవరికీ తెలియదు. దీంతో అతడు ఎవరా అని సెర్చ్ చేశారు. ఈ క్రమంలో అతడి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. హనుమంతుడిగా నటించిన అతడి పేరు దేవదత్త గజానన్ నాగే. ఇతడు మరాఠీ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జై మల్హార్’ సీరియల్లో లార్డ్ ఖండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలానే వీర్ శివాజీ, దేవయాని, బాజీరావు మస్తానీ తదితర చిత్రాల్లోనూ నటించాడు. డైరెక్టర్ ఓం రౌత్ తీసిన గత చిత్రం ‘తాన్హజీ’ లోను సూర్యజి మలుసరే పాత్రలో దేవదత్త నటించాడు. ఇప్పుడు ‘ఆది పురుష్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
READ ALSO : వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్