Advertisement
వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి.. ఈమధ్య కాలంలో ఇది కామన్ అయిపోయింది. రోజూ ఏదో ఒక హాస్పటల్ దగ్గర కుటుంబసభ్యులు ధర్నాలకు దిగుతున్నారు. అయితే.. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కడ ప్లాస్మాకి బదులు రోగికి పండ్ల రసం ఎక్కించారట.
Advertisement
ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి డెంగ్యూ వ్యాధి బారిన పడ్డాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. డెంగ్యూ వైద్యంలో కీలకమైన ఫ్లాస్మాను రోగికి ఎక్కించాలని నిర్ణయించిన వైద్యులు అదే పనిచేశారు. అయితే.. ఫ్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్ ను ఎక్కించేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
Advertisement
ప్రైవేట్ ఆసుపత్రి ముందు రోగి బంధువులు ఆందోళన చేశారు. ఈ ఘటనలో విచారణ అనంతరం ఆసుపత్రి అధికారుల వైఫల్యాన్ని ధృవీకరించిన జిల్లా యంత్రాంగం హాస్పిటల్ ని సీజ్ చేసింది. ఈ సందర్భంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
నిజానికి బ్లడ్ బ్యాంకు వారు ఇచ్చింది ఏంటో పరీక్షించాలి. ఆ తర్వాతే రోగికి ఎక్కించాలి. ఇది కనీస జ్ఞానం. అయితే.. వైద్యులు దీనిపై నిర్లక్ష్యం వహించారు. ఒకే కలర్ కదా అని కళ్లు మూసుకుని వైద్యం అందించారు. దీంతో రోగి నిండు ప్రాణం బలైపోయింది.