Advertisement
టి20 ప్రపంచ కప్ లో టీమిండియా మరోసారి ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. గతేడాది ఘోర వైఫల్యంతో సూపర్-12 దశలోనే వెనుదిరిగిన టీమిండియా ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శన చేయకూడదని అభిమానులు భావిస్తున్నారు. 2007 తొలి ఎడిషన్ మినహా మరోసారి కప్ కొట్టలేకపోయిన టీమిండియా ఈసారైనా విజేతగా నిలుస్తుందేమో చూడాలి. అయితే ఇప్పుడు భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఈ యువతి గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం.
Advertisement
READ ALSO : అదిరిపోయే ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పిన విరాట్ కోహ్లీ
రాజు లక్ష్మి లింక్ డిన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లో చదువుకుంది. అక్కడే ఆమె బాస్కెట్బాల్ షూటింగ్ గేమ్స్ పై ఆసక్తి పెంచుకుంది. అయితే జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత 2015 లో సోషల్ మీడియా మేనేజర్ గా బీసీసీఐ లో చేరింది. ప్రస్తుతం ఆమె బీసీసీఐకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కు ముఖ్య పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తుందని తెలిసింది. అలాగే అరోరా మరో ముఖ్యమైన బాధ్యతను కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించే అధికారినిగా కూడా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
Advertisement
కాగా అరోరా ఎప్పటికప్పుడు టీమిండియా ప్లేయర్లకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరవేస్తుంది. ప్లేయర్లకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడంతో ఈమెదే కీలక పాత్ర. ప్రస్తుతం బీసీసీఐకి ట్విట్టర్ లో మొత్తం మూడు అధికారిక ఖాతాలు ఉన్నాయి. ఒకటి బీసీసీఐ, రెండోది బీసీసీఐ ఉమెన్స్, మూడోది బీసీసీఐ డొమెస్టిక్ ఈ మూడు ఖాతాలకు సంబంధించిన బాధ్యతలు అన్నింటిని ఆరోరానే నిర్వహిస్తుంటుంది.
READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?