Advertisement
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మూడు రాజధానుల ప్రతిపాదన సభ ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు-అమరావతి ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సభ ముందు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆమోదం పొందిన, మండలిలో రభసకు కారణమైంది. ఆ తర్వాత మరోసారి సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. ఇక దీనిపైన అమరావతి వాసులు న్యాయపోరాటం చేశారు.
Advertisement
READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?
ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుతో పాటుగా సిఆర్డిఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణ సమయంలోనే సభలో సీఎం జగన్ ఈ బిల్లులను మరింత సమగ్రంగా సభ ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఈ పరిణామాల నడుమ హైకోర్టు దీనిపైన గత మార్చిలో తీర్పు వెలువరించింది. ఇది ఇలా ఉండగా, మూడు రాజధానుల అంశం పై అధికార వైసీపీ పార్టీలో కీలక సంకేతాలు చోటు చేసుకున్నాయి. మూడు రాజధానుల కోసం ఏపీ సీనియర్ మంత్రి ధర్మాన రాజీనామా ప్రతిపాదనలు తీసుకు వచ్చారు.
Advertisement
ఇందులో బాగంగా ఇవాళ ముఖ్యమంత్రి జగన్ తో మంత్రి ధర్మాన ప్రసాద్ భేటీ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ సాధన ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని ధర్మాన పేర్కొన్నారు. విశాఖ రాజధాని ఉద్యమం చురుగా, చైతన్య వంతంగా సాగేందుకు ఈ నిర్ణయమన్నారు ధర్మాన. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదన్న ధర్మాన.. రాజీనామాను అనుమతించాలని కోరారు. అయితే ఈ విషయం పై ధర్మానను వారించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయమని ధర్మానకు పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి జగన్.. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ పంచుతూ, వికేంద్రీకరణ , సమగ్ర అభివృద్ధే విధానమని స్పష్టం చేసారు. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ పేర్కొన్నారు. దీంతో మంత్రి ధర్మాన ప్రసాద్.. రాజీనామాపై మెత్త బడినట్లు తెలుస్తోంది.
READ ALSO : అదిరిపోయే ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పిన విరాట్ కోహ్లీ