Advertisement
ఈ భూమి మీద అన్ని బంధాల్లోకెల్లా తండ్రి కూతుళ్ల అనుబంధం వేరు. ఏ అమ్మాయినైనా నీ మొదటి ప్రేమికుడు ఎవరు? అని అడిగితే నాన్న అనే సమాధానం చెబుతుంది. అంతలా ఒక తండ్రికి, కుమార్తెకు మధ్య అనుబంధం ముడిపడి ఉంటుంది. అసలు తండ్రీ కూతుర్ల బంధం మాటల్లో చెప్పలేం. వర్ణించడం కూడా సాధ్యం కాదు. కూతుళ్ళ సంతోషం కోసం తండ్రులు ఏం చేయడానికి అయినా సిద్ధపడతారు. ఎవరికి అర్థం కాని సెంటిమెంట్ తో ఇద్దరూ ఒకరికొకరు కనెక్ట్ అవుతుంటారు. కూతురి కోరికలు తీర్చే తండ్రి, తన తండ్రి కలలు నెరవేర్చేందుకు కూతురి తపన.. ఇద్దరి మధ్య ప్రేమను వర్ణించలేము. ఈ ప్రేమను వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. అయితే కూతురిని ఐశ్వర్యవంతం చేసే తండ్రీ కూతుర్ల మధ్య జరిగే సాధారణ సంభాషణలు ఏమిటో తెలుసుకుందాం.
Advertisement
1) చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఇచ్చే సాధారణ సలహ ఏమిటంటే.. ప్రపంచంలో ఎవరినీ సులభంగా నమ్మకూడదని చెబుతారు.
2) ప్రతి కుటుంబంలోని ప్రతి తండ్రికి కొడుకు కోరిక కంటే కూతురి కోరిక తీర్చాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా ఎవరు ఏం చెప్పినా మీ కలలను, ఆశయాలను వదులుకోవద్దని.. కేవలం గమ్యం వైపు ప్రయాణించాలనే పదాలను తమ కుమార్తెలకు నేర్పించే తండ్రులు చాలామంది ఉన్నారు.
Advertisement
3) అమ్మాయిలకు నిర్దిష్ట వయసు వచ్చిన వెంటనే పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. ఆ సమయంలో తండ్రి చెప్పే మాటలు ఏమిటంటే.. మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు.. ముందు నీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలని తండ్రులు చెప్పడం మనం విన్నాం. ఇలా వారి లక్ష్యాన్ని సాధించిన మహిళలు చాలామంది ఉన్నారు.
4) కాలక్రమేణా మగవాళ్లే ఉన్నత సమాజం అనుకునే అలవాటు ఉంది. దీన్ని మార్చడానికి ప్రయత్నించండి. చదువు మాత్రమే ఈ మార్పును తీసుకురాగలదు. చదువు అనేది మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబానికి కూడా మద్దతుగా నిలుస్తుంది. చదువు వల్ల సమాజంలో గుర్తింపు పొందుతారు.
5) అందం అనేది ముఖంలో కాదు హృదయంలో.. స్త్రీలను ఎప్పుడు సౌందర్య వస్తువులుగా చూస్తారు. నిజానికి అందం అనేది బయట కనిపించేదిది కాదు. హృదయం లోనుంచి వచ్చేది. అందమైన మనసు, స్వచ్ఛమైన ఆత్మను కలిగి ఉండడం మీ గొప్ప ఆస్తి.
Read also: ‘విరాట్ కోహ్లీ’ని ఘోరంగా అవమానించిన ICC