Advertisement
తెలంగాణ మంత్రి కేటీఆర్… ప్రధాని మోడీపై కొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువచ్చేందుకు లక్షలాది విత్తనాలు రాయాలని పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డును రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన కొన్ని సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేసీఆర్ ప్రధానంగా చేనేత వస్త్రాలు మరియు చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
తన స్వాస్తాలతో రాసిన ఈ పోస్ట్ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేనేత కార్మికులకు సంబంధించిన పలు అంశాలను ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్న మంత్రి కేటీఆర్… వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తాను పలుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని… ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం… అవి చాలా ఉన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని విమర్శలు చేశారు. దేశ స్వతంత్ర సంగ్రామం లో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాల పైన పన్నువేసిన తొలి ప్రధాని మోడీనే అని ఫైర్ అయ్యారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మానిర్బర్ భారత్, గాంధీ మహాత్మా సూత్రాలను వల్లే వేసే కేంద్ర ప్రభుత్వం తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
READ ALSO : కేసీఆర్ కు షాక్.. బిజేపిలోకి 4 గురు మాజీ ఎంపీలు, ఇద్దరు మంత్రులు ?
చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS ఈరోజు ప్రధాని నరేంద్రమోడీకి ఒక పోస్ట్ కార్డుని రాశారు.#RollbackHandloomGST pic.twitter.com/EjfEgB5MpG
— BRS Party (@BRSparty) October 22, 2022