Advertisement
సైలెంట్ గా వచ్చి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధిస్తోంది కన్నడ సినిమా కాంతారా. కాసుల పంట పండిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ కు పెద్దపెద్ద వాళ్లంతా పడిపోయారు. అప్పట్లో కేజీఎఫ్ లాగా సైలెంట్ గా వచ్చి, ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి నటించి, ఆయనే స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండియా వైడ్ గా సెలబ్రిటీలను సైతం మెస్మరైజ్ చేస్తోంది. కాంతారా మూవీతో కన్నడ నాట మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి వందకు వంద మార్కులు సాధించారు. అయితే ఈ సినిమాలో ‘పంజర్లి’ మరియు ‘గులిగ’ అత్యంత ముఖ్యమైన దేవతలు. ‘కాంతారా’ ద్వారా దేశవ్యాప్తంగా పరిచయమయ్యారు. ఇప్పుడు ‘పంజర్లి’ గురించి తెలుసుకుందాం.
Advertisement
Read also: వన్డే క్రికెట్ లో 10 ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు వీరే!
Advertisement
# పంజర్లీ అనే పదానికి అర్థం
పంజర్లీ అనేది భూత కోలాలో భాగంగా పూజింపబడే మగ అడవి పంది యొక్క దైవిక ఆత్మ. తులునాడులోని ప్రాచీన దేవతలతో పంజర్లీ ఒకటి. తులునాడు అంతట పంజర్లిని పందిగా పూజిస్తారు. మన పూర్వీకులు తాము పండించిన పంటలను కాపాడాలని పంజర్లీ దేవుడిని పూజించేవారు. ఆ తర్వాత అదే వరి బియ్యం నైవేద్యంగా పెట్టి తమ పంటలను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పేవారు.
#దేవత నేపథ్యం
పంజర్లీ దేవత యొక్క పుట్టుక, వైభవం ప్రాంతాలను బట్టి భిన్నంగా ఉంటుంది. ఒక కథ ప్రకారం చాలా కాలం క్రితం తులునాడులో అడవి పందులు ఎక్కువగా ఉండేవి. చాలా అడవి పందులు రైతుల సాగు చేసిన పంటలను నాశనం చేశాయి. ఒకసారి ఒక రైతు కోపంతో తన పంటను పాడు చేస్తున్న అడవి పందిని వేటాడి చంపాడు .ఆ తర్వాత అడవి పంది ఆత్మని పూజించడం ప్రారంభించారు. ఈ వరాహం ఇలా దైవారాధనకు మూలమైందని చెబుతారు. మరొక కథనం ప్రకారం మగ, ఆడ పందులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీ సుబ్రహ్మణ్య ఆలయానికి వచ్చి భక్తిశ్రద్ధలతో భగవంతుని స్మరించుకోవడం ప్రారంభించారు.