Advertisement
దీపావళి వస్తేచాలు.. ప్రధాని మోడీ సరిహద్దులకు వెళ్తుంటారు. దేశ రక్షణే ఊపిరిగా బతికే సైనికులను కలసి ముచ్చటించడం.. వారితో కలిసి భోజనం చేయడం చేస్తుంటారు. ఇది ఏటా జరిగేదే. ఈసారి కూడా మోడీ దీపావళి వేడుకలను సైనికులతో జరుపుకున్నారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎనిమిదేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు మోడీ. కార్గిల్ లో అడుగు పెట్టిన ప్రధాని సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు.
Advertisement
సైనికుల వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని.. ఆర్మీ బలగాలను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు ప్రధాని. దీపావళి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆకాక్షించారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. జవాన్లకు ప్రధాని స్వీట్లు పంచారు.
Advertisement
ఇండియా వార్ ని మొదటి ప్రాధాన్యంగా తీసుకోదని తెలిపారు మోడీ. ఎప్పటికీ చివరి ప్రాధాన్యంగానే భావిస్తుందని తెలిపారు మోడీ. తాము శాంతినే ఆకాంక్షిస్తామన్నారు. సరిహద్దులు సురక్షితంగా ఉంటే దేశం కూడా సురక్షితంగా ఉంటుందని, ఈ దిశలో సైన్యం అందిస్తున్న సేవలు నిరుపమానమని చెప్పారు. యుద్ధం చివరి ఆప్షన్ అయినప్పటికీ ఎవరు మన దేశంపై కన్ను వేసినా దీటుగా దాన్ని తిప్పి కొట్టే శక్తి మన సాయుధ దళాలకు ఉందన్నారు.
దీపావళి సందర్భంగా సోమవారం కార్గిల్ లో సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం తానిక్కడికి వచ్చిన సందర్భం మరువలేనిదన్నారు. భారత జవాన్లు నాడు శత్రువులను ఎలా మట్టి గరిపించారో ఇప్పటికీ గుర్తుంచుకోవలసిన అంశమని చెప్పారు. కార్గిల్ యుద్దాన్ని తాను నిశితంగా గమనించానని.. జవాన్ల ధైర్య సాహసాలు నన్ను కార్గిల్ కి రప్పించాయని తెలిపారు.