Advertisement
గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కొన్నాళ్లు ఆమె వ్యాఖ్యలు, ప్రభుత్వ చర్యలను గమనించిన ఎవరైనా దీన్ని స్పష్టంగా చెప్పగలరు. రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఫైట్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో. తాజాగా మరోసారి గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులపై ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Advertisement
రాజ్ భవన్ లో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వీటికి తమిళిసై హాజరయ్యారు. అయితే.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న బిల్లులపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలో ఉంటుందని అన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
Advertisement
అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు అనుమతులు ఇచ్చే అంశం పూర్తిగా తన పరిధిలోనే వుంటుందని తెలిపారు గవర్నర్. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. గవర్నర్ గా తన పరిధికి లోబడే నడుచుకుంటున్నట్టు చెప్పారు. పెండింగ్లో ఉన్న బిల్లులను పరిశీలిస్తామన్నారు. ఎవరికీ తాను వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు సామాన్యులు తరలివచ్చారు. వారికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైతే బూస్టర్ డోస్ తీసుకోలేదో, వెంటనే తీసుకోవాలని సూచించారు. మంచి ఆరోగ్యకరమైన భోజనం చేస్తూ.. జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.