Advertisement
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు రిషి సునక్. భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో జూలైలో బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ తంతు ఆగస్టు చివరి వరకు సాగింది. ఈ పోటీలో లిజ్ ట్రస్ గెలిచి సెప్టెంబర్ లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజులకే ఆమె ఆ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆమె చేసిన సూచనలు బెడిసికొట్టాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో ఆమె రిజైన్ చేశారు. అయితే ప్రధానమంత్రి పోటీ మళ్ళీ అనివార్యమైంది. ఇప్పుడు రిషి సునక్ మొదటి బ్రిటిష్ – ఆసియన్ యూకే ప్రధాన మంత్రిగా చరిత్ర సృష్టించారు.
Advertisement
Read also: “కాంతారా” కంటే ముందే అదే కాన్సెప్ట్ తో ఓ సినిమా వచ్చిందని మీకు తెలుసా..!!
Advertisement
అయితే రిషి సునక్ పూర్వీకులు భారత్ లోని పంజాబ్ కు చెందినవారు. భారత మూలాలు ఉన్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకే కి వెళ్లారు. ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ లో 1980లో రిషి సునక్ జన్మించారు. అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పని చేశారు. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి సునక్ మొదటివాడు. 2005లో కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షిత మూర్తి పరిచయమయ్యారు. ఆ తర్వాత వారిద్దరి మనసులు కలవడంతో పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. 2009లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు. అనూక్ష, కృష్ణ ఉన్నారు.
కుటుంబానికి రిషి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. హిందూమత ఆచారాలను ఆచరిస్తారు, గో పూజలు చేస్తారు. అయితే సునక్ యూకే లో పుట్టి పెరిగినప్పటికీ అతని భారతీయ మూలాలు భారతదేశముకు చెందిన అత్యంత గౌరవనీయమైన ప్రముఖ వ్యాపార నాయకులలో ఒకరైన నారాయణ మూర్తితో అతని సంబంధాల కారణంగా భారత్ కు మరింత పేరు వచ్చింది. 200 ఏళ్ల పాటు భారత్ ను పరిపాలించిన బ్రిటన్ కు తొలిసారిగా భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని కావడం పట్ల అభినందనలు హోరెత్తిపోతున్నాయి.
Read also: హీరో పాత్ర చనిపోయిన 10 తెలుగు సినిమాలు..!!