Advertisement
మునుగోడు ఉపఎన్నిక వేళలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్తగా టీ పాలిటిక్స్ లో వలసల పర్వం మళ్ళీ మొదలైంది. నేతలు వరుస పెట్టి కండువాలు మార్చేస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలన్నీ మంతనాలు జరుపుతున్నాయి. దీంతో టీ పాలిటిక్స్ లో జంపింగ్ జపాన్ లా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు లేఖ కూడా పంపారు. ఇక బిజెపి నుంచి దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ లు టిఆర్ఎస్ లోకి దూకేశారు.
Advertisement
అయినప్పటికీ ఈ ఎన్నికలు ఎలాగైనా గెలిచి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేలా కాషాయ పార్టీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. మునుగోడులో తమకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బలమున్న అభ్యర్థి ఉన్నాడని, భారతీయ జనతా పార్టీ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుంది. మునుగోడు బైపోల్ పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. ఈ క్రమంలో మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
Advertisement
వీలైనంత త్వరగా ఆయన ప్రచారంలో పాల్గొంటారని రాజగోపాల్ వర్గీయులు చెబుతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం నేడు మునుగోడు లోని నాంపల్లి మండలంలో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఆయన జ్వరంతో బాధపడుతుండడంతో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు ప్రచారాన్ని కొనసాగించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఇక మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో బిజెపి భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. అన్నీ కుదిరితే ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించేలా బిజెపి ప్రణాళికలు రచిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
READ ALSO : రేవంత్ రెడ్డికి వెన్నుపోటులు ?