Advertisement
హాలీవుడ్ తరహాలో చిత్రాలు పోటీపడుతున్న కాలంలో వారిని తలదన్నే విధంగా తీసిన చిత్రంగా రోబో ను చెప్పవచ్చు. సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్ తో రొటీన్ చిత్రాలకు భిన్నంగా మానవ మేధస్సును ఉపయోగించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే చిత్రం. అయితే, ఇవాళ రోబో సినిమాను ఏ స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసుకుందాం.
Advertisement
Read also: హీరో పాత్ర చనిపోయిన 10 తెలుగు సినిమాలు..!!
శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాకు రీమేక్ గా శంకర్ బాలీవుడ్ లో నాయక్ అనే సినిమాను తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. శంకర్ రోబో కథను అనుకున్నాడు. కానీ కోట్ల బడ్జెట్ తో చేయాల్సిన సినిమా. మొదట కమల్ హాసన్, ప్రీతి జింతా తో కలిసి ఫోటోషూట్ కూడా చేశాడు. మీడియా డ్రీమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తామని ముందుకు వచ్చింది. కానీ కథ విషయంలో శంకర్ కు, కమల్ హాసన్ కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో ఈ ప్రాజెక్టును శంకర్ పక్కన పెట్టేశాడు. ఆ వెంటనే బాయ్స్ సినిమాను తెరకెక్కించాడు.
Advertisement
ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత మళ్లీ రోబోను షురూ చేయాలని అనుకున్నాడు. మొదట ఈ సినిమా కోసం షారుక్ దగ్గరకు వెళ్ళాడు. కథ విన్న తర్వాత షారుక్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు తానే నిర్మిస్తానని కూడా చెప్పాడు. కరీనాకపూర్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఈసారి కూడా కథ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో ఆ సినిమా మళ్లీ ఆగిపోయింది. ఆ తర్వాత అజిత్, అమీర్ ఖాన్ ల వద్దకు కూడా ఈ సినిమా వెళ్ళింది కానీ వాళ్లతో కూడా పూర్తి కాలేదు. చివరికి మళ్ళీ ఈ సినిమా రజినీకాంత్ వద్దకు వెళ్ళింది. అయితే శంకర్ రజనీకాంత్ ను విలన్ గా అనుకున్నాడు. హీరోగా షారుక్ ను అనుకున్నాడు. కానీ షారుక్ మళ్లీ కథ విషయంలో ఒప్పుకోలేదు. దాంతో రజనీకాంత్ తోనే చిట్టి క్యారెక్టర్ తో పాటు హీరో పాత్రను కూడా వేయించాడు శంకర్. ఈ సినిమా ఏ రేంజ్ లో వసూళ్లను రాబట్టిందో తెలిసిందే.
Read also: “కాంతారా” కంటే ముందే అదే కాన్సెప్ట్ తో ఓ సినిమా వచ్చిందని మీకు తెలుసా..!!