Advertisement
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్య గ్రహణం మంగళవారం సాయంత్రం కనువిందు చేసింది. మనదేశంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది కానీ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 4.29 గంటలకు మొదలైన గ్రహణం 45 నిమిషాలపాటు కనిపించింది.. ఉత్తరాదిలో సూర్య గ్రహణం ముందుగా కనిపించింది.
Advertisement
హైదరాబాదులో 4.58 గంటల నుండి 5.55 గంటల వరకు కనిపించింది. ఈ క్రమంలోనే కొందరు పాతకాలం పద్ధతిని గ్రహణ టైంలో రోకలిని ఒక ఇత్తడి పళ్లెంలో నిటారుగా నిలబెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ రోకలి నిలబడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఆ రోకలి ఎలా నిలబడుతుంది, విషయాలేంటో చూద్దాం.. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి గ్రహణం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అవుతుందనేది క్లియర్ గా తెలుస్తోంది. కానీ పూర్వకాలంలో రోకలి ద్వారానే అది తెలుసుకునే వారట.. గ్రహణం పట్టు (start), గ్రహణ విడుపు (end) ఇవి తెలుసుకోవడానికి తాంబూలం లో నీళ్లు పోసి ఆ రోకలిని తూర్పుదిశగా నిలబెడితే, అది గ్రహణం పట్టే సమయం నిలబడుతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత కింద పడుతుంది.
also read: నవంబర్ 8న చంద్రగ్రహణం…15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు..ప్రమాదం తప్పదా ?
Advertisement
సైన్స్ ప్రకారం చూస్తే ఒక వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే గురుత్వాకర్షణ శక్తి కావాలి. విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. గ్రహణ సమయంలో సూర్యుడు,చంద్రుడు, భూమి ఒకే వేదికపై వచ్చినప్పుడు సూర్య చంద్రుల మధ్య గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఈ టైంలో భూమిని ఆకర్షిస్తుంది.
ఈ రోజు సాయంత్రం పాక్షిక సూర్య గ్రహణం కారణంగా ప్లేట్ లో నీల్లు పోసి రోకలి నిలపెట్టిన బయనపల్లి లోని ప్రసాద్ అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు. pic.twitter.com/BQv0R8OMNu
— Raja Pentapati, PTI Sr. Correspondent (@RajaPentapati11) October 25, 2022
ఆ బలం వస్తువులపై పనిచేస్తే,భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేక దిశలో పనిచేస్తుండడం వల్ల రోకలి నిలబెట్టడం కొంచెం సులభం అవుతుంది. ఈ క్రమంలో పళ్ళెంలో నీళ్ళు పోసి ఆ మధ్యలో రోకలి నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడిన అసంజన బలాలు ఇందుకు దోహదపడతాయి. అందుకే గ్రహణ సమయంలో రోకలి నిలబడుతుందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ఒకరు రాసి స్క్రీన్ చాట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ అవుతుంది.
also read: