Advertisement
ఓవైపు మునుగోడు ఎన్నిక యమ రంజుమీదుంది. పార్టీలన్నీ ఇరగబడి ప్రచారం చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్ లో ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, బాలరాజుతో బేరసారాలు జరిగాయి.
Advertisement
ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.నోట్ల కట్టలతో పట్టుబడిన వారిని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
సీపీ స్టీఫెన్ రవీంద్ర దీనిపై స్పందించారు. స్పాట్ కు స్వయంగా వెళ్లిన ఆయన వివరాలు మీడియాకు వివరించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం అందిందన్న ఆయన.. పదవులు ఎర చూపి డబ్బులు ఇచ్చేందుకు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి బేరం అడుతున్నట్లు తెలిసిందని చెప్పారు.
ప్రలోబాల గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు సమాచారం ఇచ్చారని అన్నారు సీపీ. పార్టీ ఫిరాయింపునకు పాల్పడితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ఆశ చూపినట్లు చెబుతున్నారు. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.