Advertisement
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గొప్ప జీవిత కోచ్ గా పేరుగాంచారు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. చాణక్యుడు కి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీటి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇతరులతో చెప్పకూడదని పలు అంశాలను, ఒకవేళ అవి చెబితే సమాజంలో ఆ వ్యక్తి మనుగడ కష్టమని ఆచార్య చాణక్య పేర్కొన్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.
Advertisement
వైవాహిక జీవితం:
భార్యాభర్తల మధ్య చాలానే విషయాలు జరుగుతుంటాయి. అవి గొడవలు కావచ్చు, లేదా సీక్రెట్స్ కావచ్చు, ఏదైనా కూడా ఇతరుల ముందు అస్సలు బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే మీ వైవాహిక జీవితం విచ్ఛిన్నానికి దారి తీయొచ్చు. భార్య భర్తల మధ్య జరిగిన ఏ విషయమైనా మూడో వ్యక్తికి తెలియకూడదని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.
Advertisement
సిద్ధ ఔషధం:
సిద్ధ ఔషధాల గురించి తెలిసిన వ్యక్తి వాటిని సంబంధించిన సీక్రెట్స్ ను బయటికి చెప్పకూడదు. ఎప్పుడు గోప్యంగానే ఉంచాలి. అప్పుడే ఆ ఔషధాలు సక్రమంగా పనిచేస్తాయని చాణక్యుడు అన్నాడు.
దానం:
దానధర్మాలు అన్నవి మన కర్మ ఫలాలను తగ్గిస్తాయని పెద్దలు అంటుంటారు. అలాగే దాతృత్వం అనేది గొప్ప విషయంగా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అలాగే దానం చేసే విషయాలను ఎవరికీ చెప్పకూడదని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నాడు.
ఇంట్లోని గొడవలు, లోటు పాట్లు:
మీ ఇంట్లోని విషయాలు ఏవి కూడా ఇతరులతో పంచుకోకూడదు. మరీ ముఖ్యంగా ఏవైనా గొడవలు జరిగినా, లోటుపాట్లు ఉన్న వాటిని అస్సలు బయటకి చెప్పొద్దు. ఒకవేళ చెబితే అది మీ కుటుంబానికి అపకీర్తి తెస్తుంది. మీ ఇంట్లోని లోపాలను మీరే సరిదిద్దుకోవాలి. మీ శత్రువులకు ఈ వీక్ నెస్ తెలిసినట్లయితే, దాన్ని మీపై ప్రయోగించే అవకాశం ఉంది. తద్వారా సమాజంలో మీ గౌరవానికి భంగం వాటిల్లవచ్చు.
Read also : మాకు కాశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇచ్చేయండి ప్లీజ్ !