Advertisement
తెలంగాణ ప్రజలతో అడుగులో అడుగేస్తూ ముందుకెళ్తున్నారు రాహుల్ గాంధీ. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో కొనసాగుతోంది. నాలుగో రోజు యాత్రలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా.. గిరిజన కళాకారుల బృందంతో ముచ్చటించారు రాహుల్. కొమ్ములున్న గిరిజన శిరస్త్రాణం ధరించి గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు.
Advertisement
ఈ సందర్భంగా ట్విటర్ లో “మన ఆదివాసీలు మన అనాదిగా సంస్కృతులు మరియు వైవిధ్యాల భాండాగారాలు. కొమ్ము కోయ గిరిజన నృత్యకారులతో కలిసి స్టెప్పులు వేసి ఆనందించారు. వారి కళ వారి విలువలను వ్యక్తపరుస్తుంది, దాని నుండి మనం నేర్చుకోవాలి మరియు సంరక్షించాలి’’ అని పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ఢ్యాన్స్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన్ను ఈ కోణంలో ఎప్పుడూ చూడలేదని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.
Advertisement
ఇక యాత్రలో భాగంగా విద్యార్థులు, పిల్లలు, యువకులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారిని కలిశారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. జడ్చర్ల పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ రెండూ ఒకటే అన్నారు. చేనేత కార్మికులపై జీఎస్టీ పెను భారంగా మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే జీఎస్టీని తొలగిస్తామని స్పష్టం చేశారు.
విద్యా వ్యవస్థను తెలంగాణలో ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుందని విమర్శించారు రాహుల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా రంగాన్ని అభివృద్ది పరుస్తామని తెలిపారు. యువకులు, రైతులు, మహిళలతో మాట్లాడుతూ తెలంగాణ సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ఇక్కడి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఒకవైపు మోడీ రైతు వ్యతిరేక చట్టాలను తెస్తుంటే.. మరోవైపు మోడీ ప్రవేశ పెట్టిన బిల్లులకు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ మద్దతు తెలుపుతోందని మండిపడ్డారు రాహుల్.