Advertisement
భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రతిపాదన చేశారు. దేశంలో ఉన్న పోలీసు యంత్రాంగం వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు యూనిఫామ్ లు ధరించడం పై ఆయన శుక్రవారం రాష్ట్రాల హోమ్ మంత్రులతో జరిగిన చింతన్ శిబిర్ లో ప్రస్తావనకు తెచ్చారు. దేశవ్యాప్తంగా పోలీసు శాఖలో పనిచేస్తున్న వారందరికీ ఒకే టైపు యూనిఫామ్ ఉండాలనే తన అభిమాతాన్ని వ్యక్తపరిచారు. అందుకోసం వన్ నేషన్ వన్ యూనిఫామ్ ను ప్రతిపాదించారు ప్రధాని మోదీ.
Advertisement
అయితే తన ప్రతిపాదన ఇప్పటికిప్పుడు అమలు కాకపోయినా త్వరలో ఆచరణలోకి వస్తుందనే చెప్పినట్లుగా ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. వన్ నేషన్ వన్ యూనిఫామ్ పోలీసులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతోపాటు చట్ట అమలుకు సాధారణ గుర్తింపుని కూడా అందిస్తుందన్నారు మోదీ. ఇంకా ప్రధాని మోడీ మాట్లాడుతూ, నేరాలను ట్రాక్ చేయడంలో సాంకేతికత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, మనం ఇప్పుడు 5జి యుగంలోకి ప్రవేశించామని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మన సొంతమని పేర్కొన్నారు. దీనిని ఉపయోగించుకొని ముఖ గుర్తింపు సాంకేతికత, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ, డ్రోన్ మరియు సిసిటీవీ టెక్నాలజీలో అనేక రేట్లు అభివృద్ధి ఉంటుందని, తద్వారా నేరస్తుల కంటే మనం 10 అడుగులు ముందుండాలని ఆయన సూచించారు.
Advertisement
దేశంలో శాంతి భద్రతలు మరియు భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని ఏజెన్సీల సమన్వయంతో ముందుకు సాగుదామని ప్రధాని మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. అలాగే నేరాలు మరియు నేరస్తులను ఎదురుకోవడానికి రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని నొక్కి చెప్పారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్రంగా మరియు అంతర్జాతీయంగా మారుతున్నాయని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతికతతో, నేరస్తులకు ఇప్పుడు మన సరిహద్దులు దాటి నేరాలు చేసే శక్తి ఉందని, అందుకే అన్ని రాష్ట్రాల ఏజెన్సీల మధ్య మరియు కేంద్రం మధ్య సమన్వయం చాలా కీలకము అని ప్రధాన మంత్రి అన్నారు.
Read also : మునుగోడులో “గెలుపెవరిది”? COPACT తాజా సర్వే..!