Advertisement
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. ఫిర్యాదులు కూడా పోటాపోటీగా చేసుకుంటున్నాయి పార్టీలు. ఈక్రమంలోనే మీడియాతో మాట్లాడారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడులో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని.. ఆపార్టీకి తెలిసింది కూలగొట్టడం, మంటలు పెట్టడమేనని విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
Advertisement
Advertisement
సీన్ కట్ చేస్తే… జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే ఐటీ శాఖ ఎంట్రీ ఇచ్చింది. మంత్రికి పెద్ద షాకిచ్చింది. ఆయన పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై రెయిడ్ చేశారు అధికారులు. నల్లగొండలో ఉన్న ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఐటీ అధికారుల బృందం వెళ్లి సోదాలు జరిపింది. భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సుమారు 8 ఏళ్లుగా ప్రభాకర్ రెడ్డి.. మంత్రి జగదీష్ రెడ్డి వద్ద పీఏగా పని చేస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ హై కమాండ్ జగదీశ్ రెడ్డికి అప్పగించింది. ప్రచారం మొత్తం తన భుజాలపై వేసుకున్నారు ఆయన. అయితే.. రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి రెండు రోజులు సైలెంట్ గా ఉండాలని ఆంక్షలు పెట్టింది. గడువు ముగిసిన వెంటనే ఆయన మీడియా ముందుకొచ్చారు. కేంద్రాన్ని చెడామడా తిట్టేశారు. అయితే.. ఆ వెంటనే ఐటీ అధికారులు సోదాలకు రావడం చర్చనీయాంశంగా మారింది.