Advertisement
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల బిజినెస్ చాలా పెరిగింది. ఈ క్రమంలోనే హీరోల మార్కెట్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. సినిమాలు విడుదలకముందే వందల కోట్లలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే తెలుగులో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాల్లో భారీ డిజాస్టర్ అయిన చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..
Advertisement
రాధా శ్యామ్ :
ప్రభాస్ హీరోగా నటించిన రాదే శ్యామ్ ప్రపంచవ్యాప్తంగా 202 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్లు రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా ప్రభాస్ సాహో చిత్రం కూడా అనుకున్న అంచనాలను తలకిందులు చేసి డిజాస్టర్ అయింది.
2. ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. 132.50 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. ఈ సినిమా ఇప్పటివరకు 45 కోట్ల షేర్ రాబట్టింది. ఫైనల్ గా 84 కోట్ల నష్టాల పాలైంది. అంతేకాకుండా చిరంజీవి సైరా నరసింహారెడ్డి కూడా 43.45 కోట్ల నష్టలను తీసుకువచ్చింది.
3.అజ్ఞాతవాసి :
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అజ్ఞాతవాసి. ఈ మూవీ 67 కోట్ల నష్టాలను మిగిల్చింది.
అంతేకాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ కూడా 37 కోట్ల నష్టాలను తీసుకువచ్చింది.
దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమా కూడా 27 కోట్ల నష్టాలను మిగిల్చింది. కాటమరాయుడు మూవీ 25 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.
4. లైగర్:
రౌడీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ మూవీ అంచనాలను తలకిందులు చేసి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను కొన్న వాళ్ళు మూడు రేట్లు నష్టపోయారు. 61. 80 కోట్ల థియేట్రికల్ నష్టపోయింది.
5. స్పైడర్:
Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ మూవీ 120 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. చివరికి 60.50 కోట్ల నష్టాలను మిగిలించింది. నేనొక్కడినే మూవీ కూడా 42.70 కోట్ల నష్టాలు, బ్రహ్మోత్సవం సినిమా 38.80 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.
6. ఎన్టీఆర్ కథానాయకుడు:
క్రిష్ దర్శకత్వంలో తరికెక్కిన మూవీ ఎన్టీఆర్. ఇందులో బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన తండ్రి పాత్రలో కూడా నటించారు. ఈ సినిమాని రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా తెరకెక్కించారు. 50 కోట్ల బడ్జెట్ పెడితే చివరికి 20 కోట్లు వసూలు చేసి నష్టాలను మిగిల్చింది. అంతేకాకుండా బాలయ్య మరో సినిమా పరమవీరచక్ర చిత్రం కూడా 22.20 కోట్ల నష్టాలు తెచ్చింది.
7. రామయ్య వస్తావయ్య:
ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ రామయ్య వస్తావయ్య ఈ సినిమాను 40 కోట్లతో తెరకేక్కించారు. ఓవరాల్ గా 22 కోట్లకు పైగా నష్టాలు చవిచూసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ మరో సినిమా శక్తి మూవీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 22.50 కోట్ల నష్టాలు వచ్చాయి.
8. ఓం నమో వెంకటేశాయ:
నాగార్జున కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఓం నమో వెంకటేశాయ 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. 10 కోట్ల షేర్ రాబట్టి, చివరికి 23.6 కోట్ల నష్టాలను తీసుకువచ్చింది.
9. ఆరెంజ్:
మగధీర ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆరెంజ్. 46 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. 20 కోట్ల షేర్ కాబట్టి ఓవరాల్ గా 26.40 కోట్ల నష్టాలు తీసుకువచ్చింది. అంతే కాకుండా వినయ విధేయ రామ సినిమా కూడా 26.60 కోట్ల నష్టాలు, బ్రూస్ లీ మూవీ 25 కోట్ల నష్టాలను మిగిల్చింది.
10. లై :
నితిన్ హీరోగా అర్జున్ ప్రతినాయకుడిగా హనురాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లై.35 కోట్ల బడ్జెట్ పెట్టారు. 10 కోట్ల షేర్ రాబట్టి, ఓవరాల్ గా 24 కోట్ల నష్టాలు తీసుకువచ్చింది.
also read:ఏపీ ప్రజలపై జనసేనాని ఆక్రోశం ?