Advertisement
ఒక్కోసారి అదృష్టం కూడా నెత్తిమీద కూర్చుంటుంది. ఆ సమయంలో ఏం చేసినా.. ఏం జరిగినా శుభాలే ఎదురవుతుంటాయి. అలాంటి అదృష్టవంతులే వీళ్లంతా.
Advertisement
కర్ణాటకలోని చామరాజ్ నగర్ లో చెన్నప్పనపురం అనే గ్రామం ఉంది. ఇక్కడ రథోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. రెండేళ్ల తరవాత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రథోత్సవానికి ఏర్పాటు చేశారు. అయితే.. ఉన్నట్టుండి రథం విరిగిపడింది. ఆ సమయంలో దాని చుట్టూ దాదాపు 800 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.
Advertisement
రథోత్సవం జరగకపోయినా దేవుడికి ఇతర పూజలు చేసినట్లు గ్రామస్థులు చెప్పారు. రథం కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు.
గత ఏప్రిల్ లో తమిళనాడు లోని తంజావూరు జిల్లాలో రథోత్సవ ఊరేగింపు జరుగుతుండగా హైటెన్షన్ వైర్లు తగిలి 11 మంది మరణించారు. వారిలో పిల్లలు కూడా ఉన్నారు. నాటి రథోత్సవంలో కర్ణాటకకు చెందిన పలువురు భక్తులు కూడా పాల్గొన్నారు. తాజా ఘటనలో తృటిలో అంతా తప్పించుకున్నారు.