Advertisement
చాలా వరకు టీవీ చానల్స్ వాటి యొక్క టిఆర్పి రేటింగ్స్ ను పెంచుకోవాలని చూస్తూనే ఉంటాయి. దాని కోసం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. టిఆర్పి రేటింగ్ అంటే ఏమిటి.. దాన్ని ఎలా తెలుసుకుంటారు ఓసారి చూద్దాం..? సి ఆర్ పి అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్.. ఈ టిఆర్పి అనేది ఏ ప్రోగ్రామును, ఏ ఛానల్ ను ప్రజలు ఎక్కువగా చూస్తున్నారో అనేది తెలుసుకుంటారు.
Advertisement
ఈ టిఆర్పి రేటింగ్ ఎందుకంటే ఏవైనా కంపెనీలు తమ యాడ్ టీవీ లో ప్లే చేయాలి అంటే ఏ చానల్ కి ఎక్కువ టిఆర్పి రేటింగ్ ఉంటుందో చూసి ఆ ఛానల్ కి ఎక్కువగా యాడ్స్ ను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాడ్స్ ఇచ్చేవారు ఏ చానల్ కైతే టిఆర్పి రేటింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ చానెల్ కు యాడ్స్ డబ్బులు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ చానల్ ను ఎంతమంది చూస్తున్నారు. టీఆర్పి ని ఎలా లెక్కిస్తారు అనేది మనం తెలుసుకుందాం. టి ఆర్పి ని మనదేశంలో బి ఏ ఆర్ సీ బ్రాడ్కాస్టింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా దీన్ని లెక్కిస్తుంది. వీరు దేశ వ్యాప్తంగా కొన్నివేల ఇళ్లలో టీవీల్లో వారి పరికరాన్ని ఉంచుతారు.
Advertisement
ఇది ఆ ఛానల్ లో వచ్చే సౌండ్ ద్వారా ఎంతమంది రోజులో ఏ ఛానల్ ని చూస్తున్నారో తెలియజేస్తుంది. ఈ పరికరం ధర ఎక్కువగా ఉండడం వల్ల దేశంలో ఉన్న అన్ని టీవీల్లో దీన్ని అమర్చరు. శాంపిల్ కోసం కొన్ని వేల టీవీలకు మాత్రమే కనెక్ట్ చేస్తారు. మీరు కూడా మన దేశంలో ఏ చానేల్ ఎక్కువగా చూస్తారు. అనేది తెలుసుకోవాలంటే. Barcindia. Co. in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
also read;
అనౌన్స్ చేసి రిలీజ్ కానీ… మహేష్ బాబు సినిమాలు ఇవే !