Advertisement
తెలుగు సినీ ప్రియులకు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో, ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.
Advertisement
ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద కొత్త వ్యక్తులు సంచరించడాన్ని గుర్తించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయని నాదెండ్ల చెప్పారు.
Advertisement
ఆ వాహనాల్లో పవన్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారని, వారు అభిమానులు మాత్రం కారని ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. మంగళవారం కారులోనూ, బుధవారం బైకులపై పవన్ వాహనాన్ని అనుసరించారని తెలిపారు. అంతకుముందు సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి నివాసం వద్ద గొడవ చేశారని ఆయన చెప్పారు. పవన్ ఇంటి వద్ద ఎదురుగా వారు కారు నిలుపగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోబోయారని, దాంతో బూతులు తిట్టడం మొదలు పెట్టారని ఆయన వివరించారు. వారు గుజరాత్ కు చెందిన గుండాలని సమాచారం అందుతుందని ఆయన వెల్లడించారు.
Read also : సీఎం జగన్ ఓ నరరూప రాక్షసుడు?