Advertisement
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారం ఎంత దుమారం రేపిందో చూశాం. తమ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ గ్యాంగ్ రంగంలోకి దిగిందని టీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అయితే.. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని ఎవరూ ఏం మాట్లాడొద్దని కేటీఆర్ చెప్పడంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ, ఇదంతా కేసీఆర్ కుట్రేనని మొదట్నుంచి బీజేపీ అంటోంది. కేసీఆర్ కూడా సైలెంట్ గా ఉండటాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తూ వస్తోంది.
Advertisement
మునుగోడు బైపోల్ యుద్ధం ముగియగానే సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. ఫాంహౌస్ ఫైల్స్ కు సంబంధించి వీడియోలను బయటపెట్టారు. 3 గంటల ఫుటేజ్ ఉందని.. అంతా కోర్టుకు సమర్పించామని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలతో జరిగిన చర్చలకు సంబంధించిన వీడియోలను ప్రెస్ మీట్ లో లైవ్ లోనే టెలికాస్ట్ చేశారు. గత నెలలో రామచంద్రభారతి నగరానికి వచ్చారని చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారని.. 8 ప్రభుత్వాలను కూల్చామని మరో నాలుగింటిని కూల్చేందుకు చూస్తున్నామని వీడియోలో వారు చెప్పినట్లుగా ఉందన్నారు సీఎం.
Advertisement
తమ పార్టీలో కలుస్తామని కాంగ్రెస్ సభ్యులే వచ్చారని.. వారిని ఆనాడు రాజ్యాంగబద్ధమైన పద్ధతిలోనే కలుపుకొన్నామని చెప్పారు. దేశ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే మొయినాబాద్ ఫాంహౌస్ వీడియోలను బయటపెట్టామని తెలిపారు. బెంగాల్ లో 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రధానే అన్నారని.. ఈ విధానం కొనసాగితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు.
అయితే.. కేసీఆర్ ప్రెస్ మీట్ పై సెటైర్లు వేశారు బీజేపీ నేత విజయశాంతి. ‘‘మొత్తం ప్రెస్ కు టైం వేస్ట్.. కేసీఆర్ మాట్లాడిన సబ్జెక్టు అంతకన్నా వేస్ట్. ఆయన సరిగ్గా చెప్తున్నారో లేదో తెలియక కేశవరావు, హరీష్ రావు అయోమయ అవస్థలో ఉన్నట్లుగా కనిపించింది. ప్రెస్ కూడా ఈ సమావేశం పగటివేళ మాట్లాడితే మంచిదేమో అన్నట్లుంది. అసలు.. కేసీఆర్ కు బుద్ధి సరిగ్గానే ఉందా?’’ అనే డౌట్ ను వ్యక్తపరిచారు విజయశాంతి.