Advertisement
Urvasivo Rakshasivo Review in Telugu : టాలీవుడ్ లో హీరోగా అల్లు శిరీష్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దాదాపుగా మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు పేక్షకుల ముందుకు ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో రావడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటించింది. ఈ ముద్దుగుమ్మ కూడా సరైన అవకాశాలు సక్సెస్ లేక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగించలేకపోతోంది. దీంతో అటు అల్లు శిరీష్ కెరియర్ అను ఇమ్మానుయేల్ కెరియర్ ఈ సినిమా మీద ఆధారపడింది. మరి ఈ సినిమా వీరిద్దరి కెరీర్ ని మార్చిందేమో చూద్దాం.
Advertisement
Advertisement
“ఊర్వశివో రాక్షసివో” సినిమా రివ్యూ
Urvasivo Rakshasivo Review in Telugu కథ మరియు వివరణ
ఊర్వశివో రాక్షసివో సినిమా కథ విషయానికి వస్తే, ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తుడిగా కనిపిస్తారు. ఇక ఆ ఆఫీసులోనే సింధు అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. అయితే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో, ఆ ప్రేమతో వారిద్దరూ ఒకరోజు చాలా దగ్గర అయ్యేలా చేస్తోంది. ఆ సమయంలో శ్రీ, సింధును ప్రేమిస్తున్నట్లుగా తెలియజేస్తారు. కానీ అందుకు సింధు ఒప్పుకోరు. కేవలం మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని తెలియజేస్తుంది. ఇక తర్వాత శ్రీ, సింధు కోసం తన మనసును ఎలా మారుస్తారో, ఇంతకీ సింధు ఎందుకు అలా వాడుకొని వదిలేస్తుందో తెలియాలి అంటే సినిమాని థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమాలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
పాజిటివ్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ ప్లస్
అను ఇమ్మాన్యుయేల్
కామెడీ
కొన్ని యువతను ఆకట్టుకునే సన్నివేశాలు
నెగిటివ్ పాయింట్స్
కథ/స్క్రీన్ ప్లే
స్లో నేరేషన్
మంచి పాటలు, సమర్థవంతమైన BGM లేకపోవడం
Urvasivo Rakshasivo Rating రేటింగ్ 2.75/5
READ ALSO : తెలంగాణ లో కోమటి రెడ్డి సత్తా ఎంతో ప్రియాంక ఒక అంచనాకి వచ్చారా ?