Advertisement
టి20 ప్రపంచ కప్ లో భాగంగా నవంబర్ 3న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ పై వివాదం నెలకొంది. ఆయనపై ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలు వచ్చాయి. భారతదేశంలో ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ కు చెందిన నూర్ అహ్మద్ ‘విరాట్ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని’ ఆరోపించాడు. అసలు ఏంటి ఈ వివాదం, ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం.
Advertisement
7 వ ఓవర్ లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ మొదటి బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశలో ఆడాడు. అయితే, వికెట్ కీపర్ ఎండ్ లో అర్షదీప్ బంతిని విసిరాడు. మధ్యలో కోహ్లీ బంతిని పట్టుకొని నాన్ స్ట్రైక్ వైపు విసిరేస్తునట్లు కనిపించాడు. విరాట్ ఇలా చేస్తున్నప్పుడు పై ఫోటోలో కనిపిస్తున్న అంపైర్ దానిని పట్టించుకోలేదు. అప్పుడు అంపైర్ ముందు విరాట్ ఉన్నాడు. కానీ, నకిలీ ఫీలింగ్ పెనాల్టీ విధించడం అవసరమని అతను భావించలేదు. అయితే ఫీల్డ్ అంపైర్లు పెనాల్టీలు విధించవచ్చని ఐసిసి కొత్త రూల్స్ చెబుతున్నాయి.
Advertisement
భారత్ తో ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ ఆటగాడు నూరుల్ అహ్మద్ ‘అన్ ఫీల్డ్ అంపైర్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్. ను పట్టించుకోలేదని ఆరోపించాడు ఆ నిర్ణయం బంగ్లాదేశ్ కు అనుకూలంగా ఉంటే, అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. నేల తడిగా ఉంది. దాని ప్రభావం అందరికీ కనిపించింది. ఆ త్రో నకిలీదని నేను అనుకున్నాను. జరిమానా విధించి ఉంటే మ్యాచ్ మాకు అనుకూలంగా ఉండేదేమో కానీ అలా జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అసలు ఫేక్ ఫీల్డింగ్ అంటే ఏమిటి?
ఫీల్డర్ తన సంజ్ఞ లేదా చర్యతో బ్యాట్స్ మన్ ను గందరగోళానికి గురి చేస్తే దానిని ఫేక్ ఫీలింగ్ అంటారు. అంటే బంతి తన వద్ద లేకపోయినా, బంతిని పట్టుకొని విసిరినట్లు కనిపించడం అన్నమాట.
ఫేక్ ఫీలింగ్ పై ఐసీసీ నియమం ఏది చెబుతుంది?
ఐసీసీ చట్టం 41.5 సరికాని ఆటకు సంబంధించినది. బ్యాట్స్ మన్ దృష్టిని ఉద్దేశపూర్వకంగా మరల్చడం, మోసం చేయడం లేదా అడ్డుకోవడం కోసం బంతిని డెడ్ బాల్ గా పేర్కొనవచ్చు. అలాగే, బ్యాటింగ్ చేసిన జట్టుకు పెనాల్టీగా 5 పరుగులు లభిస్తాయి. అంపైర్ భారత్ పై 5 పరుగుల పెనాల్టీ విధిస్తే, టీమిండియా ఫలితం మరోలా ఉండేది.
READ ALSO : Urvasivo Rakshasivo Review : “ఊర్వశివో రాక్షసివో” సినిమా రివ్యూ