Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు వైవహిక జీవితంలో, ఇటు రాజకీయ రంగంలో ఆ గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక పేరుని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ కాలం యువతకు ఐకాన్ స్టార్ గా మారిన పవర్ స్టార్ బెస్ట్ సినిమాల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.
Advertisement
# గోకులంలో సీత
గోకులంలో సీత సినిమా యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, రాశి, కోట శ్రీనివాస్ రావు, హరీష్, సుధాకర్, శ్రీహరి, అచ్యుత్, బ్రహ్మానందం, మల్లికార్జున రావు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.
# సుస్వాగతం
సుస్వాగతం 1998 లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, దేవయాని ప్రధాన పాత్రలో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రఘువరన్, సుధా తదితరులు నటించారు.
# తొలిప్రేమ
తొలిప్రేమ 1998 లో ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన ప్రేమ కథ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి ముఖ్య పాత్రలో నటించారు.
# బద్రి
బద్రి సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, మల్లికార్జున రావు, కోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.
# ఖుషి
Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చి పెట్టిన మూవీ. ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకున్న సినిమా.
# బాలు
బాలు సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.
#జల్సా
పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది అందరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమాలో సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయి.
# తీన్మార్
జయంత్ సి పరాంజి దర్శకత్వం. విక్రమ్ శ్రీనివాస్ మాటల రచయిత వచ్చిన సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
# గబ్బర్ సింగ్
దబాంగ్ రీమేక్ గా వచ్చినా, చాలా భాగం కథ, కథనం మార్చి, హరీష్ శంకర్ తన కలం బలం చూపించి మాస్ ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశాడు.
# అత్తారింటికి దారేది
త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రెండవ సినిమా అత్తారింటికి దారేది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్రాసిన పంచ్ డైలాగ్స్ బాగా పెలాయి. అలాగే కామెడీ, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.