Advertisement
సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ఎంతోమంది నటీనటులు కలిసి పనిచేయడం వల్ల వారి మధ్య ప్రేమ పుట్టడం సర్వసాధారణం. సినిమా ప్రపంచంలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉంటాం. హీరోలు మాత్రమే కాదు.. డైరెక్టర్లని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇలా దర్శకుల ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
1) రోజా సెల్వమణి.
ఓవైపు రాజకీయాలు, మరోవైపు బుల్లితెర షో తో తన గ్రేజ్ ను మరింత పెంచుకుంటున్న రోజా 2022లో.. తమిళ దర్శకుడు ఆర్కె సెల్వమణి ని వివాహమాడారు.
2) రమ్యకృష్ణణ్.
దర్శకుడు కృష్ణవంశీ, రమ్యకృష్ణ.. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2003లో వివాహం చేసుకున్నారు.
3) సుహాసిని మణిరత్నం.
దర్శకుడు మణిరత్నం, సుహాసిని గారు 1988లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
4) శరణ్య పొన్వనన్.
Advertisement
దర్శకులు పొన్వనన్, నటి శరణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
5) ఖుష్భు.
తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఖుష్భు , దర్శకుడు సుందర్ 2000 వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
6) దేవయాని.
దర్శకుడు రాజకుమారన్, నటి దేవయాని 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి దేవయాని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
7) ప్రీత విజయ్ కుమార్.
తమిళ దర్శకుడు హరి, నటి ప్రీత ప్రేమ వివాహం చేసుకున్నారు.
8) రాశి.
దర్శకుడు నివాస్, నటి రాశి ప్రేమ వివాహం చేసుకున్నారు.
9) నయనతార.
ఇక తాజాగా దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతార ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 9న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది.
ఇక వీరితోపాటు యంగ్ హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని రోజులకే విడాకులు తీసుకోని విడిపోయారు.