Advertisement
‘విరాట్ కోహ్లీ’ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా చిన్న స్థాయి జీవితం నుంచి మొదలుపెట్టి ఈ రోజున భారతదేశంలోనే నెంబర్ వన్ క్రికెటర్ గా ఎదిగాడు. తన తండ్రి మరణించిన రోజే ఆటపై ఎంత ప్రేమ ఉందో చూపించాడు. దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఆరోజు ఆడిన ఒక్క మ్యాచ్ తో తన యొక్క నిబద్ధత, గొప్పతనం ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన, తండ్రికి చివరి కోరిక తీర్చడం చేసినటువంటి వ్యక్తి మన పరుగుల వీరుడు.
Advertisement
కోహ్లీ మైదానంలోకి దిగాడు అంటే, పరుగుల వరద పారాల్సిందే, రికార్డుల మూత మోగాల్సిందే. హాఫ్ సెంచరీలు, సెంచరీలను కూడా మంచినీరు తాగినంత సులువుగా చేస్తుంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో 71 శతకాలు బాదిన ఘనత కోహ్లీది. కోహ్లీ తన బ్యాటింగ్ తో ఎందరో అభిమానులను సంపాదించాడు. కేవలం భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. పోరుగు దేశం చైనాలో కూడా కోహ్లీకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.
Advertisement
ఆడిలైడ్ వేదికగా బుధవారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ చైనా యువకుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు. చైనా యువకుడు తన బుగ్గలపై మువ్వన్నెల పతాకం పెయింట్ వేసుకున్నాడు. మ్యాచ్ అసాంతం భారత్ కు మద్దతుగా నిలిచాడు. చైనాకు చెందిన యువకుడు ఆడిలైడ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. విరాట్ కోహ్లీకి డై హార్డ్ ఫ్యాన్ అయిన అతడు కింగ్ కోహ్లీని చూసేందుకు మ్యాచ్ కు వచ్చాడు. విరాట్ కోహ్లీ అంటే తనకు అభిమానమని, తన ఆట బాగా నచ్చుతుందని చెప్పాడు. కోహ్లీ కోసం సదరు యువకుడు హిందీలో మాట్లాడడం విశేషం. భారతదేశం, అక్కడి సాంస్కృతి అన్నా చాలా ఇష్టమని చైనా యువకుడు చెప్పాడు. చివరగా ‘భారత్ మాతాకీ జై’ అని చెప్పాడు. చైనా యువకుడు హిందీ మాట్లాడడం చూసిన అక్కడి భారత్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
ఇవి కూడా చదవండి : టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా !