Advertisement
హైదరాబాద్ మహానగరం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణలో టిఆర్ఎస్ పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు పెట్టాయి. ఈ తరుణంలో హైదరాబాద్ మహానగర ప్రజలకు మరో శుభవార్త అందింది. హైదరాబాద్ లో ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మాదిరిగా మరో క్రికెట్ మైదానం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
Advertisement
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో క్రీడా శాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బలోపేతం చేయాలని అధికారులకు శ్రీనివాస్ గౌడ్ సూచించారు. హెచ్సీఏ విస్తరణకు తగిన కార్యాచరణను రూపొందించాలన్నారు. 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను తక్షణమే ఏర్పాటు చేసి, తద్వారా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
Advertisement
తెలంగాణలో జిహెచ్ఎంసితో పాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రికెట్ క్లబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్లబ్ లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మాదిరిగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో క్రికెట్ మరింత విస్తరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి : చైనాలో కింగ్ కోహ్లీ క్రేజ్.. నీ అవ్వ తగ్గేదెలే !