Advertisement
తెలుగుదేశం, జనసేన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఏపీ మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాజకీయంగా దిగజారుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటంలో పరుగులు పెట్టరన్నారు. ఈ మేరకు శనివారం గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, మునుగోడులో కేఏ పాల్ ఎంటర్టైన్మెంట్ తో రక్తి కట్టించారని, ఆయన కంటే వెనుకబడిపోయానని పవన్ ఇప్పటం వచ్చారని ఎద్దేవా చేశారు.
Advertisement
ఇప్పటంలో షో అయిపోగానే రెండు గంటలకల్లా వెళ్లిపోయారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, ఇలా షోలు చేయకూడదని కోడాలి నాని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు నిద్ర పట్టడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. లేని సమస్యలను పవన్ చంద్రబాబు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వారిద్దరూ వాళ్ళ సమస్యలతోనే సతమతమవుతున్నారని పేర్కొన్నారు.
Advertisement
గులకరాయి పెట్టి కొడితే పోవడానికి చంద్రబాబు ఏమైనా పావురమా? పిట్టనా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై దాడి చేసే అవసరం ఎవరికీ లేదన్నారు. చంద్రబాబు బాదుడే బాదుడే అని పలికిమాలిన కార్యక్రమం మొదలు పెట్టాడని విమర్శించారు. బాదుడే బాదుడే అంటే, చంద్రబాబును బాదమన్నాడేమోనని ఎవడో రాయి తీసుకొని కొట్టినట్టుగా సెటైర్లు వేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మతి ఉండే మాట్లాడుతున్నాడా అని విమర్శించారు. మోదీని చూస్తేనే చంద్రబాబుకు భయం అని ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా ఒక్క సలహా అయినా ఇచ్చాయా అని ప్రశ్నించారు.
read also : మునుగోడు ఉప ఎన్నిక.. రూ.3037 కోట్ల మద్యం తాగేశారు ?