Advertisement
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఫాంహౌస్ వ్యవహారంలో గొడవ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కి చేరింది. ఇలాంటి సమయంలో మోడీ తెలంగాణకు వస్తుండడంతో కేసీఆర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారా? లేదా? అనే దానిపై చర్చ సాగుతోంది.
Advertisement
ఈనెల 12న ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో రామగుండం వెళతారు. రూ.6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. మోడీ టూర్ ఏర్పాట్లను అత్యంత పకడ్భందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్యూరిటీ, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు.
Advertisement
మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళతారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల నేపథ్యంలో మోడీని కలవరే అభిప్రాయం అంతటా వ్యక్తం అవుతోంది. మొన్నటి ప్రెస్ మీట్ లో కూడా బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తిట్టిపోశారు. అలాంటిది మోడీకి ఆహ్వానం పలకడం, కార్యక్రమంలో పాల్గొనడం అనేది తప్పుడు సంకేతాలు ఇస్తుందని కేసీఆర్ వెళ్లకపోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ప్రారంభోత్సవం కావడంతో కేసీఆర్ కూడా హాజరయితేనే మంచిది అనేది కొందరి వాదన.
ఇటు ప్రధాని సభ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు భారీ ఎత్తున రైతులను తరలించాలని సంజయ్ నేతలకు సూచించారు. అయా జిల్లా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.