Advertisement
T20 World Cup 2022 : టి20 ప్రపంచ కప్ లో జింబాబ్వే పై టీం ఇండియా 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. తోలుతా టీం ఇండియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య చేదనలో జింబాబ్వే 17.2 ఓవర్లకు 115 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్ లో సికిందర్ రజా(34*), బర్ల్ (35) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు.
Advertisement
భారత బౌలర్లలో అశ్విన్ 3, షమీ, హార్దిక్,2 వికెట్ల చొప్పున తీయగా, భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ నెల 10న సెమీస్ లో ఇంగ్లాండ్ తో టీం ఇండియా తలపడనుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 13 బంతుల్లో, 2 ఫోర్లతో, 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ (3) విఫలం కాగా, విరాట్ కోహ్లీ 26, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశాడు.
Advertisement
దినేష్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ 5 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జింబాబ్వే బౌలర్లు సీన్ విలియమ్స్ 2, ఎన్ గరవ, ముజరబని, సికిందర్ రజా తలో వికెట్ తీశారు. సూర్య కుమార్ (59*) దూకుడుగా ఆడి ఆఫ్ సెంచరీ తో పాటు టి20లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెమిస్ లో భాగంగా ఈ నెల 10 వ తేదీన భారత్, ఇంగ్లాండ్ తో తలపడనుంది. 9 వ తేదీన పాకిస్తాన్, న్యూజిలాండ్ తో పోటీ పడనుంది.
READ ALSO : కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇక సన్యాసమే ?