Advertisement
సముద్రం నేపథ్యం జాలరుల జీవన విధానానికి అద్దం పడుతూ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. జాలరుల జీవితాలతో ముడిపడిన ప్రేమ కథగా ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ కూడా సంచలన విజయాన్ని సాధించింది. అలా సముద్రాన్ని నమ్ముకున్న జీవితాలు చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులను పలకరించడానికి ‘జెట్టి’ సినిమా సిద్ధమైంది.
Advertisement
మన్యం కృష్ణ, నందిత శ్వేత జంటగా నటించిన ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రను మైమ్ గోపి పోషించాడు. వేణుమాధవ్ నిర్మించిన ఈ సినిమాకి సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించాడు. కార్తీక్ కోడకండ్ల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 4న రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలోని విడుదల చేశారు. కాగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్ మరియు కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Advertisement
ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సినీ రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడే నేను జెట్టి సినిమా చూశాను. ఆ సినిమా చాలా బాగుంది. కొత్త దర్శకులు సుబ్రహ్మణ్యం పిచ్చుక చాలా బాగా తెరకెక్కించారు. నిర్మాత కే.వేణుమాధవ్ మొదటి సినిమాను కమర్షియల్ గా మరియు సమాజానికి ఏమైనా చెబుదాం అనే ఉద్దేశంతో తెరకెక్కించారు. అది చాలా గొప్ప విషయం. ఆయనను నేను అభినందిస్తున్నాను. ఈ సినిమాలో చాలామంది థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి.
Read also: కృష్ణంరాజు చివరిదాకా అందరికీ భోజనం పెడుతూ వచ్చింది ఎందుకో తెలుసా..!