Advertisement
మనిషి కంటూ ఒక గమ్యం ఉండాలి. దాన్ని చేరుకోవాలనే సంకల్పం ఉండాలి. ఎన్ని కష్టనష్టాలకోర్చి అయినా అనుకున్న గమ్యం చేరుకోవాలి. అదే లక్ష్య సాధన. సాధన అంటే పట్టువదలని పరిశ్రమ వెనకడుగు వేయని తత్వం. అన్నింటిని మించి నిర్లక్ష్యం, సోమరితనం ఈ రెండూ ఉండకూడని లక్షణాలు మన లక్ష్యానికి మృత్యువులు, శత్రువులు కూడా అవే రెండు. సోమరితనం కాలాన్ని హరిస్తుంది.కాలాన్ని పోగొట్టుకున్న వారికంటే ధన హీనులు,జ్ఞానహీనులు మరొకరు ఉండరు. పోగొట్టుకున్న సంపద ఎప్పుడో ఒకసారి తిరిగి వస్తుంది.
Advertisement
Advertisement
కానీ దాటి పోయిన కాలాన్ని తిరిగి పొందడం అసంభవం, అసాధ్యం. కోల్పోయిన రాజ్యాలను తిరిగి సాధించుకున్న రాజులు ఉన్నారు. హరించుకుపోయిన ధనరాశులను మరలా పోగు చేసుకున్న వారు ఉన్నారు. కానీ కాల దన్నుకున్న కాలాన్ని తిరిగి తెచ్చుకున్న వారు ఒక్కరు కూడా లేరు. కాలం ఒక ప్రవాహం. కొండ ప్రాంతం నుంచి జర జర ఉరకలు తీస్తూ ఎగిసిపడే ప్రవాహం. ప్రవాహం ఏ విధంగా వెనక్కి రాదో కాలం కూడా అదే విధంగా వెనక్కి రాదు.
ఈ అనంత కాల ప్రవాహంలో మనిషి జీవితకాలం అణువు కంటే తక్కువ. కాబట్టి మనిషి తన ఈ అతి చిన్న జీవితకాలాన్ని వృధా చేసుకోకూడదు.జ్ఞాన సాధనలో మానవీయ మార్గం లో అలసత్వం చూపకుండా ముందుకు సాగాలి. ఈ జన్మలో చేయాల్సిన పనులు మరో జన్మకు వాయిదా వేసుకోవడం కుదరదు.కాబట్టి ఈ జన్మని వృధా చేసుకోకూడదు. ప్రతిక్షణం జ్ఞానం కోసం, దుఃఖ రహిత మార్గం కోసం శ్రమించాలి.
also read;
అనౌన్స్ చేసి రిలీజ్ కానీ… మహేష్ బాబు సినిమాలు ఇవే !