Advertisement
మైలవరపు సూర్యనారాయణ (ఎమ్మెస్ నారాయణ).. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. 17 సంవత్సరాల కెరియర్ లో దాదాపు 700 పైగా సినిమాలలో హాస్యనటుడిగా నటించాడు. ఈయనకి ఓ కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. ఎమ్మెస్ నారాయణ తనయుడు విక్రమ్ నటుడిగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నించినప్పటికీ.. ఆయనకి పెద్దగా కలిసి రాలేదు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Read also: పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన 10 రీమేక్ సినిమాలు
తనకి సినిమాలంటే మొదటినుండి చాలా ఇష్టమని.. ఎప్పటికైనా మంచి ఆర్టిస్టుగా అవుతాననే బలమైన నమ్మకం తనకు ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే నటుడిగా చేసినంతవరకు సంతోషంగా ఉండేదని చెప్పారు. అయితే చిత్ర పరిశ్రమలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్లీ కలుస్తామో లేదో, ఒకసారి కలిసి పనిచేసిన వారితో మళ్ళీ పని చేస్తామనే నమ్మకం లేదన్నారు. ఇక బ్యాగ్రౌండ్ ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో పైకి వస్తారని చెప్పుకుంటారని.. అదే నిజమైతే అభిషేక్ బచ్చన్ స్టార్ హీరో అయిపోవాలి కదా? కానీ అలా జరగలేదన్నారు. సినిమాలలో సక్సెస్ కాకపోయినా ఇతర రంగాలలో సక్సెస్ అయిన సెలబ్రిటీల కొడుకులు కూడా ఉన్నారని ఆయన చెప్పుకోచ్చారు. ఇక ఒక్క టాలెంట్ ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడతారని కూడా గట్టిగా చెప్పలేమన్నారు.
Advertisement
అందుకు అదృష్టం కూడా కావాలన్నారు. టాలెంట్ పరంగా చూస్తే.. అబ్బాస్, తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి టాలెంట్ ఉన్న నటులకి అదృష్టం కూడా కలిసి వచ్చినప్పుడే మిగతావన్నీ కూడా తోడు అవుతాయని తన మనసులోని మాటని చెప్పుకొచ్చారు. ఇక తాము సెలబ్రిటీ కొడుకులు కాకపోయి ఉంటే తప్పకుండా పైకి వచ్చేవారిమేమోనని అభిప్రాయపడ్డారు. బ్రహ్మానందం గారి అబ్బాయి ఆయన కొడుకు కాకపోయి ఉంటే ఈరోజు స్టార్ హీరో అయ్యేవాడేమో? పెద్ద పెద్ద స్టార్స్ ని చూస్తూ బ్రహ్మానందం గారి అబ్బాయిని ఎలా స్టార్ చేస్తారని.. ఇది అందరికీ వర్తిస్తుందని విక్రమ్ పేర్కొన్నారు. అలాకాకుండా సొంతంగా వస్తే ఇండస్ట్రీలో రాణించే వాళ్ళమేమోనని చెప్పుకొచ్చారు.