Advertisement
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో రిషబ్ శెట్టి తాజాగా నటించిన కన్నడ చిత్రం “కాంతారా” దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ వారం ఇతర భాషల్లో డబ్బింగ్ అయినప్పటి నుండి, ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందుతుంది.
Advertisement
అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ముగుస్తుందో ఊహించడం కూడా ట్రేడ్ పండితులకు చాలా కష్టంగా మారింది. రెండు ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా రికార్డులు కొల్లగొడుతోంది. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో రిషబ్ శెట్టి, ఒక్క సినిమాతో స్టార్ హీరో క్రేజ్ ను దక్కించుకున్నారు.
Advertisement
కన్నడలో కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ లోనూ రిషబ్ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. దర్శకత్వంతో పాటు స్వయంగా నటించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా అతను కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో కాసేపట్లోనే అవి నెట్టింట వైరల్ గా మారాయి. రిషబ్ శెట్టి, ప్రగతిలది ప్రేమ వివాహం. కామన్ ఫ్రెండ్ ద్వారా ఫేస్బుక్ తో మొదలైన సాన్నిహిత్యం పెళ్ళి వరకు వెళ్లింది. వీరికి కొడుకు రన్వీత్, కూతురు రాద్యా ఉన్నారు. తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
READ ALSO : పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ కౌంటర్..అలా చేస్తే ఏపీ మహిళల పరిస్థితి ఏంటి !