Advertisement
టీమిండియా, సూపర్-12 దశలో తన చివరి మ్యాచ్ జింబాబ్వే తో ఆడిన సంగతి తెలిసిందే. మేల్ బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మన జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఎల్లుండి ఇంగ్లాండ్ తో సెమిస్ లో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియాకు షాక్ తగిలింది. సెమీ ఫైనల్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆడి లైడ్ లో మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని చేతికి బంతి తగిలింది. త్రో డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి ఆడే క్రమంలో హిట్ మ్యాన్ గాయపడ్డాడు.
Advertisement
ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందో, సెమీస్ కు అందుబాటులో ఉంటాడో లేదో బీసీసీఐ ఇంకా అధికారికంగా ఏమి చెప్పలేదు. భారత్ గురువారం ఇంగ్లాండ్ తో సెమిస్ ఆడే సంగతి తెలిసిందే. ఆడి లైడ్ లో టీం ఇండియా ఉదయమే ప్రాక్టీస్ కు దిగింది. ఆటగాళ్లంతా హుషారుగా సాధన చేస్తున్నాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ నేతృత్వంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. అయితే ఓ బంతి అతడి కుడి చేతికి తగిలింది.
Advertisement
నొప్పితో విలవిల్లాడిన హిట్ మ్యాన్ అక్కడే కూలబడ్డాడు. దాంతో అందరి ముఖాల్లోనూ ఆందోళన కనిపించింది. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చల్లాడు. ఆ తర్వాత ఆ గంటన్నర విశ్రాంతి తర్వాత అతడు మళ్ళీ బ్యాట్ పట్టినట్లు తెలుస్తోంది. ఏ ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేసినప్పటికీ ఒకవేళ నొప్పి తిరగబడితే మాత్రం ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెమెస్ కు ముందు హిట్ మ్యాన్ ఇలా గాయపడటం పట్ల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తనదైన రోజున పొట్టి ఫార్మాట్లో చెలరేగి ఆడగల బ్యాటర్, విజయవంతమైన కెప్టెన్ గా పేరొందిన రోహిత్ కు గాయమైతే టీమ్ ఇండియాకు ఇబ్బందులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
REad also : గ్రహణం రోజు ఈ నియమాలు పాటిస్తే, దోషాలు పోతాయి !