Advertisement
మనం యూట్యూబ్ లో పాటలు వింటాం, సినిమాలు చూస్తాం, ఆ అమ్మాయి కూడా యూట్యూబ్ చూసింది. కానీ సరదా కోసం కాదు. పాఠాల కోసం. యూట్యూబ్ లోనే క్లాసులు విని ఏకంగా ఎంబిబిఎస్ లో రాష్ట్రస్థాయిలో 700 వ ర్యాంకు సాధించింది. నిజామాబాద్ కు చెందిన హారిక ఈ ఘనతను సాధించింది.
Advertisement
Read also: ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!
జిల్లా కేంద్రంలోని నామ్ దేవ్ వాడకు చెందిన సతీష్ కుమార్ అనురాధ ల కుమార్తె హారిక. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికు రాలిగా పనిచేస్తూ కూతురిని చదివించింది. హారిక మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్ లో 942 మార్కులు సాధించింది. ఇంటర్ తర్వాత నీట్ లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ఇంట్లోనే యూట్యూబ్ లో వీడియో క్లాసులు వింటూ నీట్ కు సిద్ధమైంది.
Advertisement
నీట్ లో జాతీయస్థాయిలో 40 వేల ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 700 వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్ లోని ఓ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంట్లోనే ఉండి పోయింది. హారిక ఆర్థిక పరిస్థితి గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో విషయం తెలుసుకున్న నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమె చదువు బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని, ఎంబిబిఎస్ చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా హారికను ఆర్థికంగా ఆదుకుంటానని ఇటీవలే భరోసా ఇచ్చారు.
Read also: తక్కువ బడ్జెట్ తో భారీగా లాభాలు తెచ్చిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇవే!