Advertisement
కాంతారా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ కన్నడ సినిమా తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సత్తాను చాటింది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయి అక్కడ మంచి విజయాన్ని అందుకున్న తర్వాత, తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. రిషబ్ శెట్టి నటించి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను దాదాపు 16 కోట్లతో తెరకెక్కించగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కన్నడిగుల సంప్రదాయమైనటువంటి భూత కోలా ఆచారం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు.
Advertisement
also read: వయసులో వారి కంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు.. ఎవరంటే..?
Advertisement
ఇక చిత్రం క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన వేరే లెవెల్ అని చెప్పవచ్చు. దీంతో హీరో రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతుంది. ఈ రిషబ్ శెట్టి ఎవరు అంటూ గూగుల్ లో కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో తెలియజేశారు.. ఇంట్లో నాన్నను డబ్బులు అడగలేక చిన్నచిన్న పనులు చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించారని తెలిపారు. కూలి పనికి వెళ్లడం అక్కడ వచ్చిన డబ్బులతో సినిమా చూసే వాడినని అన్నారు.
2004 నుండి 2014 వరకు మినరల్ వాటర్ ప్లాంట్ లో వాటర్ క్యాన్లు అమ్ముతూ డబ్బులు సంపాదించానని తెలియజేశారు. దీని తర్వాత పలు హోటల్స్ లో పని చేశానని, ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ సినిమాల్లో ఛాన్స్ కోసం ట్రై చేశానని తెలియజేశారు. ఇక ఇండస్ట్రీలో లైట్ బాయ్, క్లాప్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని కిరాక్ పార్టీకి దర్శకత్వం వహించానని తెలియజేశారు. ఈ విధంగా రిషబ్ శెట్టి తానే డైరెక్టర్గా హీరోగా చేసిన కాంతారా మూవీ సెన్సేషనల్ హిట్టు కొట్టడంతో అందరికన్ను తన వైపు పడేలా చేసుకున్నాడు.
also read: కళ్ళు చిదంబరం కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా..!!