Advertisement
టీమిండియా భీకర బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరూ ఆడని షాట్లను ఆడుతూ.. ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అంతేకాదు.. టి20 ప్రపంచ కప్ లో ఓ సంచలనంగా మారాడు. వరల్డ్ కప్ లో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో 225 పరుగులు చేసి, ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అటు ఆటలోనే కాక సంపాదనలోనూ దుమ్మురేపుతున్నాడు సూర్య కుమార్. 2011 ఐపీఎల్ లో రూ. 10 లక్షల కు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.
Advertisement
అక్కడ నిలకడైన ఆటగాడిగా ఆ పేరు సంపాదించుకున్నాడు సూర్య. దాంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి, 2021లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ నుంచి గ్రేడ్ సి కాంట్రాక్ట్ ద్వారా సూర్య కుమార్ కు వార్షిక వేతనం కింద కోటి రూపాయలు వస్తోంది. అదికాక ముంబై ఇండియన్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గాను రూ. 8 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. నెలకు కోటి రూపాయలు ఆర్జించే సూర్య సంపాదన రూ. 30 కోట్ల నెట్ వర్త్ గా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Advertisement
అది కాక మాగ్జిమ వాచ్, నీమాన్స్ ఫుట్ వేర్, పింటో పీనట్, సరీన్ స్పోర్ట్స్ వంటి పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక సూర్య దగ్గర విలువైన లగ్జరీ కార్లు, బైక్ కలెక్షన్లు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ గ్యారేజ్ లో రూ.40 లక్షలు ఖరీదు గల టయోటా ఫార్చునర్, రూ.75 లక్షల ఖరీదైన బిఎండబ్ల్యు 5 సిరీస్ 530 డిఎమ్ స్పోర్ట్స్ కారు, హల్క్ జీపు, నిస్సాన్ జోంగా, రేంజ్ రోవర్ హ్యుందాయ్ ఐ20 లాంటి కార్లతో పాటు హార్లీ డేవిడ్ సన్, సుజుకి హయబుసా వంటి బైకులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందరి చూపు సూర్య పైనే ఉన్నందున పలు కంపెనీలు తమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని క్యూలు కడుతున్నాయి. అది కాక టీమిండియా టి20 ప్రపంచ కప్ గెలిస్తే, సూర్య రేంజ్ పెరిగిపోయి రోహిత్, విరాట్ సరసన చేరతాడని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read also: ఐపీఎల్ లో ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన 10 మంది క్రికెటర్లు