Advertisement
కన్నడలో రూపొంది పాన్ ఇండియా సినిమాగా విడుదలైన తాజా చిత్రం “బనారస్”. జైడ్ ఖాన్& సోనాల్ మొంటీరో జంటగా నటించిన ఈ చిత్రానికి జయ తీర్థ దర్శకుడు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్ సినిమా మీద ఎలాంటి ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. ఇక మొన్న శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. మరి సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
Advertisement
కథ మరియు వివరణ
బనారస్ (వారణాసి) నేపథ్యంలో సాగే చిత్రమిది. సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్ తో సింగర్ ధని (సోనాల్ మెంటోరియో) నీ ప్రేమలో పడేస్తానని బెడ్ కడతాడు. ఓ జాతరలో ఆమెని కలుసుకొని తాను ఒక ఆస్ట్రోనాట్, టైం ట్రావెలర్ ని, తాను ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి వచ్చానని చెబుతాడు. అంతే కాదు నువ్వు తనకు కాబోయే భార్యవి అని అందుకే నిన్ను కలిశానని చెబుతాడు. ఈ క్రమంలో టైం ట్రావెలర్ కి సంబంధించిన కొంత థియరిని ఎక్స్ ప్లేయిన్ చేస్తాడు. దీంతో దాన్ని అతన్ని నమ్మేస్తుంది. తన రూమ్ కి కూడా తీసుకెళ్తుంది.
Advertisement
రాత్రి బెడ్ పై ఆమెతో ఫోటో తీసుకుని ఫ్రెండ్స్ తో కాసిన బెట్టు ని గెలుస్తాడు సిద్ధార్థ్. అనంతరం వాళ్లు విదేశాలకు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. దానితో రాత్రి సమయంలో బెడ్ పై దిగిన సెల్ఫీ ని సిద్ధార్థ్ ఫ్రెండ్ అనుకోకుండా ఇతరులకు షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మానాన్న లేని దాని బనారస్ లో ఉండే తన బాబాయ్, పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. తన వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిందని గిల్టీ ఫీలింగ్ తో బాధపడిన సిద్ధార్థ్, తన తప్పుని చెప్పి క్షమాపణ కోరదామని బనారస్ వస్తాడు. సిద్ధార్థ్ నీ ధని క్షమించిందా? ఆయన ప్రేమలో ఎలా పడింది? సిద్ధార్థ జీవితంలో టైమ్ ట్రావెల్ కథ ఏంటి, చివరికి ఈ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.
ప్లస్ పాయింట్స్:
అద్వైత గురుమూర్తి సినిమా ఆటోగ్రఫీ వర్క్
ఎడిటింగ్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ ను సరిగా నడిపించలేకపోయాడు.
కథకుడు ఫెయిల్
ప్రొడక్షన్ డిజైన్&వి.ఎఫ్.ఎక్స్ వర్క్
రేటింగ్: 3/5