Advertisement
Yashoda Movie Review in Telugu : చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. టాలెంటెడ్ అండ్ గ్లామరస్ క్వీన్ సమంత అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను చాలా ఏళ్లుగా ఫిదా చేస్తున్న ఈ భామ, వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో పంతాను మార్చుకొని ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సమంత ‘యశోద’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
read also : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ?
Yashoda Movie Story: కథ మరియు వివరణ
పేద అమ్మాయిల అవసరాలను క్యాష్ చేసుకొని వాళ్లకు డబ్బు ఆశ చూపి సరోగసి మదర్స్ గా మారుస్తూ ఉంటారు. ధనవంతుల పిల్లల్ని గర్భంలో మోసే యంత్రాలు చేస్తారు. అయితే అది అంతటితో ఆగదు. దానికి వెనుక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు చేతులు కలిపిన మాఫియా ఉంటుంది. ఆ మాఫియాకు బలైన యువతుల్లో యశోద కూడా ఒకరు. అసలు సరోగసి పేరుతో అక్కడ జరుగుతున్న వ్యాపారం ఏమిటి? తల్లులుగా మారిన యువతులను ఏం చేస్తున్నారు? యశోదకు తెలిసిన నిజం ఏమిటి? అంత పెద్ద మాఫియాను యశోద ఒంటరిగా ఎలా ఎదిరించింది? అనేది మిగతా కథ.
Advertisement
సినిమా మొదట్లో అన్ని కీలక పాత్రల పరిచయాలతో ప్రారంభమై, సినిమా అసలు కథలోకి రావడానికి సమయం పడుతుంది. అయితే, ఒక్కసారి యశోదకి సరోగసికి సంబంధించిన నిజాలు తెలియడంతో సినిమా ఆసక్తికరంగా మారి మిమ్మల్ని సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సినిమా వాతావరణం. మనం ఏ సినిమాలోను చూడని వాతావరణం ఈ చిత్రంలో చూస్తాం. యశోదలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఉన్నాయి. సరైన మొత్తంలో డ్రామా మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మొదటి సగం ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ అన్ని లేయర్ లు ఒక్కోటిగా విప్పుతున్నప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంటుంది మరియు రెండవ సగం మాతృత్వ భావోద్వేగంపై దృష్టి పెట్టింది మరియు ఆ భావోద్వేగం బాగా పండింది అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్లు:
కథ
స్క్రీన్ ప్లే
నటన
యాక్షన్ సీక్వెన్స్ లు
మైనస్ పాయింట్లు:
దర్శకత్వంలో లోపాలు
కొన్ని సాగదీసిన సన్నివేశాలు
రేటింగ్ : 2.5/5
Read Also : లిక్కర్ స్కామ్ లో విజయసాయి అల్లుడి అరెస్ట్..?