Advertisement
వెరైటీ వంటకాలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే దొరికే వంటకాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బ్యాంబూ చికెన్ ఒకటి. వెదురు బొంగులతో తయారు చేసే ఈ వంటకానికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. విశాఖ ఏజెన్సీ, ఇతర గిరిజన ప్రాంతాల్లో ఈ బొంగు చికెన్ దొరుకుతుంటుంది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బ్యాంబూ చికెన్ ను స్వయంగా వండిన వీడియో ఒకటి బయటకొచ్చింది. నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Advertisement
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ మధ్యే తెలంగాణలో యాత్రను ముగించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. అయితే.. తెలంగాణ పర్యటనలో ఉన్న సమయంలో గిరిజనులతో కలిసి బ్యాంబూ చికెన్ చేశారు రాహుల్. దానికి సంబందించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియోకు లైకుల వర్షం కురుస్తోంది.
Advertisement
యాత్రలో భాగంగా ఓచోట ఆగిన టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తన యాత్ర సాగిన తీరు, నేతల నుంచి అందిన సహకారం తదితర విషయాలపై చర్చించారు. అదే సమయంలో గిరిజనులతో కలిసి రాహుల్ బొంగు చికెన్ వండారు. చికెన్ కు బాగా మసాలా దట్టించి అప్పటికే సిద్ధం చేసిన బొంగులో పెట్టారు. ఆయనతోపాటు ఇతర నేతలు, గిరిజనులు కూడా చేశారు.
అందరూ కలిసి మంటపై పెట్టి బొంగులను కాల్చారు. ఆ తర్వాత నేతలతో కలిసి పలు అంశాలపై మాట్లాడారు రాహుల్. బొంగు చికెన్ తయారు కాగానే చికెన్ ను బయటకు తీసి అందరికీ ప్లేట్లలో పెట్టారు రాహుల్. పార్టీ నేతలతో పాటు గిరిజనులకు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా బొంగు చికెన్ రుచి అద్భుతమని కొనియాడారు.