Advertisement
అమెజాన్ వరల్డ్ బిగ్గెస్ట్ షాపింగ్ హబ్ గా చెబుతారు. ఇందులో దొరకని వస్తువంటూ ఉండదు. మన ఇంట్లో కూర్చొని ప్రపంచ నలుమూలల లో ఎక్కడ ఉన్న వస్తువు నైనా ఈ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాంటి సౌకర్యాలున్న ఈ అమెజాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎలా స్టార్ట్ అయింది.. దాని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకుందాం..? అమెజాన్ డాట్ కామ్.వల్డ్స్ బిగ్గెస్ట్ ఆన్లైన్ స్టోర్.
Advertisement
ఒక చిన్న గది లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఈ కంపెనీని 1994లో జెఫ్ బెజోస్ దీన్ని స్థాపించారు. అయితే మొదట ఆయన దీనికి పెట్టిన పేరు కడాబ్ర. ఇక రెండవ విషయానికి వస్తే అమెజాన్ లోగో. అమెజాన్ స్టార్ట్ చేసిన మొదట్లో లోగో వేరే విధంగా ఉండేది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ లోగో వెనుక చాలా పెద్ద లాజిక్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి మనం ఈ లోగో లో ఉన్న బాణం గుర్తును గమనిస్తే అది ఫస్ట్ లెటర్ a నుండి ఫోర్త్ లెటర్ z ను పాయింట్ చేస్తుంది.
Advertisement
అంటే a టు z ఏదైనా సరే అమెజాన్ లో లభిస్తుందని చాలా తెలివిగా ఈ లోగో ద్వారా చెప్పారు. ఇక అమెజాన్ రెవెన్యూ విషయానికి వస్తే 2016 నాటికి మొత్తం కంపెనీ రెవెన్యూ సుమారుగా 107 బిలియన్ డాలర్స్. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో పనిచేసే వారి సంఖ్య సుమారుగా 268900 మంది. అమెజాన్ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ యుఎస్ లోని వాషింగ్టన్ లో ఉన్నాయి. అమెజాన్ సీఈవోగా ఆ కంపెనీ ఫౌండర్ మిస్టర్ జెఫ్ బెజోస్ ప్రస్తుతం పని చేస్తున్నారు
Also Read: హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండు సార్లు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..?